కరోనా క్రైసిస్‌‌పై మోడీని బద్నాం చేస్తారేంటి?

కరోనా క్రైసిస్‌‌పై మోడీని బద్నాం చేస్తారేంటి?

గుహవాటి: దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీని బద్నాం చేయడం సరికాదని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, కాబట్టి ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కోరడంపై బిస్వా మండిపడ్డారు. ఢిల్లీలో కరోనా పరిస్థితులను ఎదుర్కోవడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని, దీనికి మోడీ సర్కార్‌‌ను విమర్శించడం సరికాదని బిస్వా శర్మ అన్నారు. ఎన్డీయేతర రాష్ట్రాలకు మోడీ ఇతోధిక సాయం అందించారని బిస్వా చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో 8 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయని, ఢిల్లీలోనూ 8 ప్లాంట్లు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్డీయేతర రాష్ట్రాలైన మహారాష్ట్రకు (1,661 మిలియన్ టన్నుల ఆక్సిజన్), ఢిల్లీకి (480ఎంటీ), ఏపీ (440ఎంటీ), తెలంగాణ (360ఎంటీ), ఛత్తీస్‌గఢ్ (227ఎంటీ), రాజస్థాన్ (207ఎంటీ), పంజాబ్‌‌కు 136 మిలియన్ టన్నుల ఆక్సిజన్‌‌ను పంపామని బిస్వా పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయాలు అనవసరమన్నారు.