ఈమధ్యకాలంలో ఆల్కహాల్ తాగే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ మార్గాలు కూడా ఎక్సైజ్ శాఖలే మారుతున్నాయి. కొందరు ఆల్కహాల్ తాగితే వాంతులు చేసుకుంటారు. దీనికి రకరకాల కారణాలుగా ఉంటాయి. వారి శరీర తత్వాన్ని బట్టి కారణాలు వేరుగా ఉంటాయి. ఆల్కహాల్ తీవ్రతను తట్టుకునే శక్తి ఒక్కొకరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరు ఆల్కహాల్ తక్కువగా తాగినప్పటికి వారికి వాంతులవుతాయి. వారిలో ఆల్కహాల్ తట్టుకునే శక్తి తక్కువగా ఉండొచ్చు లేదా ఏమైనా ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావొచ్చు.
ఆల్కహాల్ ను సేవించేటపుడు, మితిమీరి కాకుండా, బాధ్యతాయుతంగా తాగటం అవసరం. అలాగే, వాంతులు మాటిమాటికీ, ఎక్కువగా అవుతూ ఉన్నా, అది వేరే ఆరోగ్య సమస్యలకు దారి తీసినా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని, పరిష్కరించుకోవటం, ముందు జాగ్రత్త పడటం అవసరం.
కారణాలు ఇవి..
డీహైడ్రేషన్
ఆల్కహాల్ శరీరంలో మూత్రం ఎక్కువ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల మూత్రానికి ఎక్కువగా వెళ్లటం వల్ల, శరీరంలో నీటి స్థాయి తగ్గిపోతుంది. ఇది డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. డీహైడ్రేషన్ కూడా వాంతులకు ఒక కారణం కావొచ్చు.
ఆల్కహాల్ విషపూరితంగా మారటం
ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో సేవించినపుడు అది పాయిజనింగ్‌గా మారుతుంది. ఇది బయటకు వచ్చే టైంలో వాంతులు అవుతాయి. దీనివల్ల ప్రాణానికే ప్రమాదం కావచ్చు. ఎవరైనా ఈ సమస్య ఎదుర్కుంటుంటే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లటం మంచిది.
స్పీడ్‌గా ఆల్కహాల్ తాగడం
తక్కువ సమయలో ఒకేసారి ఎక్కువగా ఆల్కహాల్ సేవించటం వల్ల, అది విషపూరితంగా మారి, శరీర జీవక్రియ మీద ఒత్తిడి పెరుగుతుంది, తద్వారా, శరీరంలో రక్షణ వ్యవస్థ మీద కూడా ఒత్తిడి పెరిగి, అది వాంతులకు కారణమవుతుంది.
ఆల్కహాల్ వేరే డ్రగ్స్‌తో మిక్స్ అయినప్పుడు
ఒకే రకమైన బ్రాండ్ కాకుండా.. రెండు మూడు రకాల ఆల్కహాల్ తాగినప్పుడు అది వాంతులు కావడానికి దారితీయవచ్చు. అయితే ఆ మిక్సింగ్ అయిన పదార్థాన్ని బట్టి తీవ్రత ఉంటుంది. ఇలా చేయటం కొన్ని సార్లు ప్రాణానికే ప్రమాదం కావచ్చు. మందులు వాడుతున్నపుడు ఆల్కహాల్ సేవించాలంటే మీ డాక్టర్ ను సంప్రదించండి.
జీర్ణాశయ గోడలు దెబ్బతినటం
ఆల్కహాల్‌కు జీర్ణాశయ లైనింగ్‌పై ఒత్తిడి కలిగించే సామర్థ్యం ఉంటుంది. దీంతో ఇది వాంతులకు కారణమవుతుంది. ఇది అసిడిటీ, గ్యాస్టిక్ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
తాగిన వెంటనే ప్రయాణించడం
ఆల్కహాల్ సేవించిన తర్వాత వాహనంలో వెళ్లటం వల్ల కడుపులో తిప్పుతుంది. దీన్ని మాషన్ సిక్నెస్ అంటారు. ఇలా తిప్పటం వల్ల వాంతులకు అవుతాయి.
ఆరోగ్య సమస్యలు
అసిడిటీ, జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువగా మద్యం తాగితే తర్వాత వాంతులు అవుతాయి. ఇది కొంతమందిలో వారి బరువు, శరీరతత్వం వంటి అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది.