ప్రతి విషయాన్నీ అనుమానిస్తారా?.. కోవ్యాక్సిన్ ఫుల్ సేఫ్

ప్రతి విషయాన్నీ అనుమానిస్తారా?.. కోవ్యాక్సిన్ ఫుల్ సేఫ్

హైదరాబాద్: ఈ దేశంలో ప్రతి ఒక్కరూ అనుమానాస్పదంగా ఎందుకు ప్రవర్తిస్తారని కోవ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్ల ప్రశ్నించారు. కోవ్యాక్సిన్ సేఫ్టీపై పలు  పుకార్లు, ఊహాగానాలు వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో కృష్ణా ఎల్ల పైవిధంగా స్పందించారు. మిగిలిన కరోనా వ్యాక్సిన్ తయారీదారులతో పోల్చితే తమ వద్ద ఎక్కువ డేటా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. కోవ్యాక్సిన్‌‌ ఫేజ్-3 ట్రయల్స్‌‌ను 25,800 మంది వాలంటీర్లతో నిర్వహించామని, అయితే దాని తాలూకు రిజల్ట్స్ ఇంకా రాలేదన్నారు. భోపాల్‌‌లో నిర్వహించిన కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంపై కృష్ణ స్పందిస్తూ.. అతడి మృతికి వ్యాక్సిన్‌‌కు సంబంధం లేదన్నారు. కోవ్యాక్సిన్ పూర్తి సురక్షితమైందని, మిగిలిన అన్ని టీకాలతో పోలిస్తే అత్యధిక డేటా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో 200 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టామన్నారు.