పబ్లిక్ టాయిలెట్ల వెలుపల రాసి ఉండే WC అంటే ఏంటో తెలుసా..

 పబ్లిక్ టాయిలెట్ల వెలుపల రాసి ఉండే WC అంటే ఏంటో తెలుసా..

ప్రపంచంలో రోజురోజుకూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అభివృద్ధి విషయంలో మరింత ముందుకు వెళ్తున్నాము. కానీ నేటికీ చాలా మందికి అర్థం కాని, తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటిని మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నా, అర్థం కాకపోయినా పట్టించుకోం. అవే షార్ట్ ఫామ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే WFH అని ఎలా అయితే షార్ట్ ఫామ్ లో చెబుతున్నామో.. అదే తరహాలో ఓ వర్డ్ ను శతాబ్దాలుగా వాడుతున్నా.. దాని అసలు మీనింగ్ మాత్రం ఏంటో చాలా మందికి తెలియదు. అదే పబ్లిక్ టాయిలెట్ల వెలుపల రాసి ఉండే WC అనే పదం.

ఈ పదాన్ని మనం ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. కానీ చూసిన వాళ్లందరికీ దాని అర్థం తెలుసా.. తెలిస్తే ఎంత మందికి తెలుసు.. ప్రత్యేకించి దీని గురించి చెప్పడానికి మరో కారణం.. ఇటీవల సోషల్ మీడియాలో, Quoraలోనూ దీని అర్థం కోసం సెర్చ్ చేశారని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంతకీ ఆ పదం అసలు అర్థం ఏమిటి..? మాములుగా పబ్లిక్ టాయిలెట్ల బయట ఆడ, మగ లేదా షీ, హీ అనే ఇంగ్లీషు పదాలతో గానీ లేదా వాళ్లను సూచించేలా బొమ్మలు గానీ వేసి ఉంటాయి. వాటితో పాటు WC అనే పదం ఉండడం ఎవరైనా గమనించారా..?

WC అనేది బాత్రూమ్‌కు మరో పేరు. దీని పూర్తి రూపం వాటర్ క్లోసెట్. బాత్‌రూమ్‌లలో ఉండే  వాషింగ్ బేసిన్‌లనే వాటర్ క్లోసెట్ అని కూడా అంటారు. చాలా మంది దీని అర్థం వినగానే మునుపెన్నడూ వినలేదని అన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో చాలా మంది టాయిలెట్ లేదా బాత్రూమ్ కంటే వాటర్ క్లోసెట్ అనే పేరు రాయడం కాస్త ఇబ్బంది అని తెలిపినట్టు సమాచారం. ఇప్పుడైనా తెలిసిందా.. బాత్రూమ్ వెలుపల WC అని ఎందుకు రాస్తారో..!