శ్రీకృష్ణుడు  తలపై నెమలి నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడో తెలుసా

శ్రీకృష్ణుడు  తలపై నెమలి నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడో తెలుసా

శ్రీకృష్ణుడు ఎప్పుడూ నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించి ఎంతో అందంగా కనిపిస్తాడు. నెమలి ఈకతోనే ఆయనకు కళ ఉట్టిపడుతుంది. . అయితే ఆ నెమలి పింఛం ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?ఆ విధంగా శ్రీ కృష్ణుడు తలపై నెమలి నెమలి పింఛం పెట్టుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణుడు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించిన నారాయణుడు దుష్ట శిక్షణ గావించాడు. అయితే ఎనిమిది భార్యలు, పదహారువేల మంది గోపికలతో రాసలీలలు సాగించాడని, అతడు శృంగార పురుషడని తెలియనివారు విమర్శిస్తారు. ఏ అవతార పురుషుడూ ఇంత మంది స్త్రీలను భార్యలుగా పొందలేని అంటారు. 

శ్రీకృష్ణుని చూడగానే వెంటనే గుర్తుకు వచ్చేది నీలిరంగు మొహం, చేతిలో పిల్లనగ్రోవి, తలపై నెమలి నెమలి పింఛం, చుట్టూ పదహారు వేలమంది గోపికలతో ఎంతో అల్లరి చేస్తూ కనిపిస్తాడు. శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఎన్నో అల్లరి పనులు చేస్తూ అందరిని ఎంతో సరదాగా ఆటపట్టిస్తూ ఉండేవాడు. ఇంతటి అల్లరి చేష్టలు కలిగిన కన్నయ్య తలపై నెమలి నెమలి పింఛం ఉంటుంది.

శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో కేవలం సరస సల్లాపాలు మాత్రమే ఆడాడు. ఎప్పుడూ కూడా వారి విషయంలో హద్దులు దాటి ప్రవర్తించలేదు. తను ఎంతో అల్లరి చేస్తూ ఎంతోమందిని ఆటపట్టించే వాడు. ఈ విధంగా కృష్ణుడు, గోపికల మధ్య ఉన్నది కేవలం ఒక పవిత్రమైన స్నేహం మాత్రమే కృష్ణుడు భోగి రూపంలో కనిపించే ఒక యోగిగా మాత్రమే ఉన్నాడు. 

శ్రీకృష్ణుడు తన అల్లరి చేష్టలతో ఎంతోమందిని ఆకట్టుకున్న శ్రీ కృష్ణుడు తన తలపై ఉన్న నెమలి పింఛం విషయానికి వస్తే ప్రపంచంలోనే సంభోగం చేయని జీవిగా నెమలిని చెప్పవచ్చు. అదేవిధంగా పదహారు వేల మంది గోపికలు ఉన్నా శ్రీకృష్ణుడు కూడా ఎంతో పరమ పవిత్రుడు అని భావించి నెమలి నెమలి పింఛాన్ని శ్రీకృష్ణుడి తలపై ధరించాడు. ఈ నెమలి  పింఛం శ్రీకృష్ణుడు తలపై ధరించడం వల్ల అతని పవిత్రతను తెలియజేస్తుంది. అంతేకాకుండా నెమలిని ఒక పవిత్రమైన పక్షిగా మన హిందువులు భావిస్తారు. నెమలి  పింఛం మన ఇంటిలో ఉండటం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు

కేవలం నాస్తికులే కాదు భగవంతుడిని నమ్మేవారు కూడా కృష్ణుడు కామ స్వరూపమేనని భావిస్తారు. కానీ కృష్ణతత్త్వాన్ని తప్పుగా భావించకూడా... ఆయన శిఖలోని నెమలి ఫించం భోగి రూపంలోని యోగేశ్వరుడని తెలియజేయడానికి సంకేతం. అయితే ఆ జగన్నాటక సూత్రధారి లీలలు తెలిసిన వారు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడతారు.