సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం ఎందుకు అంతా ఇంపార్టెంట్‌?

సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం ఎందుకు అంతా ఇంపార్టెంట్‌?
  • ఎరోడైనమిక్స్‌ స్టడీ రిలీజ్‌ చేసిన ఐఐఎస్‌సీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్క్‌ ధరించాలని, సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించాలని చెప్తూనే ఉన్నారు. దాంతో వైరస్ మనకు వ్యాప్తి చెందడని నిపుణులు హెచ్చరించారు. కాగా.. అవి ఎందుకు అంత ఇంపార్టెంట్‌, ఎందుకు సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించాలనే దానిపై సైంటిస్టులు మ్యాథమ్యాటికల్‌ మోడల్‌ను రిలీజ్‌ చేశారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) బెంగళూరు రీసెర్చ్‌ చేసింది. జర్నల్‌ ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌లో ద్వారా దాన్ని రిలీజ్‌ చేశారు. రెస్పిరేటరీ డ్రాప్‌లేట్స్‌ ద్వారా కరోనా ఎక్కువగా స్ప్రెడ్‌ అవుతుందని మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో వాటిపై సైంటిస్టులు మ్యాథమేటికల్‌ మోడల్‌ రిసెర్చ్‌ చేశారు. తుమ్మినా, దగ్గినా బయటికి వచ్చే డ్రాప్‌లెట్స్‌ కరోనా వ్యాప్తికి కారణం అని అన్నారు. కాగా.. ఈ మేరకు ఆ డ్రాప్‌లెట్స్‌ గాలిలో ఎవాపరేట్‌ అయ్యే ముందు8 నుంచి 13 ఫీట్స్‌ వరకు గాలిలో ప్రయాణించగలవని తేలిందని అన్నారు. ఎరోడైనమిక్స్‌ మీద ఫోకస్‌ చేసి వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి హెల్తీ వ్యక్తికి ఎలా చేరుతుందనే విషయాన్ని కనుకున్నామని సైంటిస్టులు చెప్పారు. “ డ్రాప్‌లెట్‌ సైజ్‌, అది ఎంత దూరం ప్రయాణిస్తుంది. దాని లైఫ్‌టైం తదితర అంశాలను మాస్‌, మొమెంటమ్‌, ఎనర్జీ అండ్‌ స్పైసెస్‌ ఆధారంగా అంచనా వేశాం. దాని ద్వారా డ్రాప్‌లెట్‌ ఎంత దూరం, ఎంత సేపట్లో, ఎంత కాలం ఉంటుంది అనే విషయం కనుకున్నాం” అని సైంటిస్ట్‌ ఒకరు వెల్లడించారు. గాలి లేకుండా పరిసరాల పరిస్థితిని బట్టి బిందువులు ఆవిరైపోయే ముందు 8 నుంచి 13 అడుగుల మధ్య ప్రయాణించడాన్ని కనుకున్నాం అని అమెరికాలోని శాన్‌ డియాగోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌‌ సాహా అన్నారు. దీంతో జనం కచ్చితంగా ఆరు అడుగుల కంటే ఎక్కువ సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటిస్తూ మాస్కులు వేసుకోవాలని అన్నారు. ఈ రిసెర్చ్‌లో కనుగొన్న అంశాల ప్రకారం నామ్స్‌ పాటిస్తూ స్కూళ్లు, ఆఫీసులు తెరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.