
పాకిస్థాన్.. అనగానే చాలా మంది ఇండియన్లకు సుర్రున కోపం తన్నుకొస్తుంది. కానీ,ఆ దేశానికి చెందిన ఓ యువతిని మాత్రం మనోళ్లుతెగ లైక్ చేసేస్తున్నారు. ఆమెకు ఫాలోవర్లుగా మారుతున్నారు. ఆమె పేరు నైలా ఇనాయత్ . వయసు33 ఏళ్లు. చాలా పెద్ద సంస్థలకు (ఇంటర్నేషనల్)ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. పుల్వామా టెర్రర్ ఎటాక్ తర్వాత ఇండియా.. పాకిస్థాన్ బాలాకోట్పైదాడి చేసిన విషయం తెలిసిందే. అప్పుడు టమాటలమీద పేలిన జోకులు మామూలుగా ఉన్నాయా మరి.అక్కడి నుంచి మొదలైంది.. పాక్ ప్రభుత్వం పై ఆమెసెటైర్ల వర్షం . ‘‘భర్త: ఇవ్వాళేంటో మాంసం రుచి తేడా కొడుతోంది. భార్య: టమాటలు రావట్లేదు కదా..అందుకే అణుబాంబులతో చేశా” అంటూ ఆమెజోక్ పేల్చేసింది. బాలాకోట్‌పై దాడి అనంతరం..పాక్ ఆర్మీ ప్రతినిధి ఒకరు ఆ ప్రాంతం ఫొటోలనుపెట్టారు. దానికి ఆమె.. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ఆ పొటోగ్రాఫర్ ను నియమించుకోవాల్సిందని, అతడైనాటైంకు అక్కడకు చేరుకున్నాడని మరో సెటైర్ వేసింది.‘‘ఇండియా మమ్మల్ని బెదిరిం చేముందు.. మా వెనకచాలా దేశాలున్నాయి. ఎందుకంటే.. వాళ్లకు అప్పులు కట్టాలిగా” అని మరో సెటైర్ . ఆ ట్వీట్‌ను వేలాదిమంది ఇండియన్లు రీట్వీట్ చేశారు. 20వేల మందికి పైగా లైక్‌చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్మీదా ఎన్నెన్నో సెటైర్లు పేల్చిందామె. అందుకే ఇండియాలో బాలీవుడ్ సెలెబ్రిటీల దగ్గర్నుంచి మామూలు జనం వరకు ఆమెను ఫాలో అవుతున్నారు. ఫ్యాన్స్ అయిపోయారు. పాకిస్థాన్ మీద సెటైర్లు వేస్తున్నా కాబట్టే ఇండియన్లు తనను లైక్ చేస్తున్నారన్న ఆమె.. తాను ఏపార్టీకీవ్యతిరేకం కాదని చెప్పింది. తనను ట్రోల్ చేసే వాళ్లూ ఉన్నారని చెప్పింది. ఇమ్రాన్ ఖాన్‌పై సెటైర్ వేసినందుకు.. ఆయన్ను పెళ్లి చేసుకోవడం కోసమే ఇలాచేస్తున్నానని చాలా మంది ట్రోల్ చేశారని చెప్పింది.