వానకాలం వచ్చిందంటే చాలు.. దగ్గు, జ్వరం, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు.. ఇలా రకరకాల సీజనల్ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతుంటారు. వానకాలం ముందు, వానకాలం ప్రారంభం అయిన తర్వాత కూడా తరుచుగా ఇదే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు హెపటైటిస్- ఎ, హెపటైటిస్-ఈ వంటి నీటి ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఉంది. డెంగ్యూ, చికున్ గున్యా వంటి సంక్రమణ రోగాలు వానకాలంలోనే ఎక్కువ. అయితే ఎందుకు వానకాలంలోనే వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఆరోగ్య నిపుణులు చెబుతున్న చిట్కాలు తెలుసుకుందాం..
వేసవి వేడినుంచి రిలీఫ్ నిచ్చే వానకాలం.. వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా తీసుకొచ్చే కాలం కూడా ఇదే. వైరస్ ల మనుగడ, సంతానోత్పత్తికి అనుకూలమైన కాలం. వైరస్ లు ఎక్కువ కాలం జీవించి ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తాయి. మన దేశంలో తేమ , వెచ్చని ఉష్ణోగ్రతలు రుతు పవనాల టైం అంటే వానకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు బాగా పెరిగేందుకు ప్రధాన కారణం.
►ALSO READ | నల్లని జుట్టు కోసం... అమ్మమ్మల కాలం నాటి శీకాకాయ్ చిట్కాలు.. వద్దన్నా జుట్టు పెంచేసే..
అంతేకాకుండా వర్షాల సమయంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దోమల ద్వారా డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులకు కారణమవుతాయి. హెపటైటిస్- ఎ, హెపటైటిస్-ఈ వంటి నీటి ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ మార్గాలు..
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
దోమల నివారణ మందులు, దోమతెరలను ఉపయోగించాలి.
మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలి.
రోడ్డు పక్కన విక్రయించే ఆహారాన్ని నివారించాలి.
తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలి.
గదుల్లో గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి.
జ్వరం, దగ్గు ఉన్నవారు విశ్రాంతి తీసుకోవాలి.
ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి?
జ్వరం రెండు రోజులకుపైగా ఉంటే, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, పదేపదే వాంతులు, దద్దుర్లు, రక్తస్రావం, కళ్లు పసుపు రంగులోకి మారడం లేదా తీవ్ర బలహీనత కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. సరైన పరిశుభ్రత, శుభ్రమైన తాగునీరు, దోమల నియంత్రణ వంటివి పాటించడం ద్వారా వానాకాల వైరల్ ఇన్ఫెక్షన్లను చాలావరకు నివారించవచ్చు.
