అందంగా లేవని భర్త వేధింపులు.. భార్య సూసైడ్

అందంగా లేవని భర్త వేధింపులు.. భార్య సూసైడ్

ఖైరతాబాద్ వెలుగు: భర్త, అత్తామామల వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య చేసు కుంది. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్​కు చెందిన హలీమాబేగం(25) కు సిటీలోని బోరబండ స్వరాజ్​నగర్​కు చెందిన అబుల్ హాసిఫ్ (32) తో 2018 జూన్​లో పెండ్లి అయ్యింది. వీరికి రెండున్నరేళ్ల కొడుకు అబ్దుల్ హబీబ్ ఉన్నాడు.  లావుగా ఉన్నావని, అందంగా లేవని, రెండో పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్లుగా ఆమెను భర్త వేధిస్తున్నాడు. మరోవైపు అత్త బీబీ ఫాతిమా, మామ అబ్దుల్ జానీమియా సూటిపోటి మాటలు అంటున్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన హలీమాబేగం గురువారం ఉదయం తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పి, తీసుకెళ్లమని కోరింది. కొద్ది సేపటి తర్వాత ఆమెకు తల్లి ఫోన్​చేయగా ఎత్తకపోవడంతో ల్యాండ్​లైన్​కు చేయగా, తోటికోడలు మాట్లాడి హలీమాబేగం ఉరేసుకుని చనిపోయిందని చెప్పింది.  తల్లిదండ్రులు వచ్చి తమ కుమార్తె చావుకు భర్త, అత్తామామలే కారణమని ఎస్​ఆర్​నగర్ ​పోలీసులకు కంప్లయింట్​ చేయగా కేసు నమోదు చేశామని ఇన్​స్పెక్టర్​ సైదులు తెలిపారు.