ఆమెకు హృతిక్ అంటే పిచ్చి.. అసూయతో భార్యను హత్య చేసిన భర్త

ఆమెకు హృతిక్ అంటే పిచ్చి.. అసూయతో భార్యను హత్య చేసిన భర్త

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ఉన్న అభిమానం ఓ యువతి ప్రాణం తీసింది. అమెరికా న్యూయార్క్ లో నివాసం ఉంటున్న దినేశ్వర్, డోజోయ్ లు భార్య భర్తలు. భర్త దినేశ్వర్ సాఫ్ట్ వేర్ గా విధులు నిర్వహిస్తుండగా, భార్య డోజోయ్ బార్ లో ఉద్యోగం చేస్తోంది.   భార్య కి హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే భర్తను కూడా హృతిక్ రోషన్ లా  ఉండాలని సతాయించేంతలా. పగలు, రాత్రి నిర్విరామంగా హృతిక్ లా అలా చేయాలి. హృతిక్ లా ఇలా కండలు పెంచాలని భర్తకు చిరాకు తెప్పించేది.  తనని కాదని హృతిక్ రోషన్ గురించి మాట్లాడడంతో భర్త కు అసూయ కలిగింది. ఇదే విషయంపై ఇద్దరిమధ్య గొడవపెరిగింది. ఈ గొడవలతో డోజోయ్ , హృతిక్ రోషన్ పై విపరీతంగా అభిమానం పెంచుకుంది.

భార్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  చిత్రహింసలకు గురిచేసేవాడు.  భర్త వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులకు  ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త దినేశ్వర్ ను నాలుగురోజుల పాటు జైలు శిక్ష విధించారు. జైలు శిక్షతో భార్య డోజోయ్ పై భర్త దినేశ్వర్ కక్షపెంచుకున్నాడు. తనవల్లే జైలు జీవితం అనుభవించానని కుమిలిపోయేవాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఇంటికి వెళ్లి భార్యను హతమార్చాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు.  డోజోయ్ మృతిపట్ల ఆమె సన్నిహితులు స్పందించారు. హృతిక్ రోషన్ అంటే డోజోయ్ కి అభిమానమని చెప్పారు. ఆ అభిమానంతోనే భర్తతో గొడవపడేదని తెలిపారు.