
పొట్టకూటి కోసం తునికాకు సేకరిస్తారు. చద్ది బువ్వ కట్టుకొని పొద్దున్నే అడవి బాట పడతారు. తునికాకులే వారికి నాలుగు రూపాయిలు తెస్తాయి. అలా తునికాకు సేకరిస్తున్న ఓ మహిళపై అడవి దున్న దాడి చేసింది. దీంతో ఆ మహిళకు తీవ్రగాయాలయ్యాయి మృతి చెందింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లాలో అడవి దున్నలు రెచ్చిపోతున్నాయి. గంగారం మండలం మామిడిగూడెంకు చెందిన జనగం సృజన అనే మహిళ తునికాకు సేకరణకు అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆకును కోసుకుంటుడగా అటుగా వస్తున్న అడవి దున్న సృజనపై దాడి చేసింది. గట్టిగా కేకలు వేయడంతో తోటి కూలీలు వచ్చి దున్నను వెళ్లగొట్టారు. అప్పటికి తీవ్రగాయాలతో బాధ పడుతున్న సృజనను స్థానికులు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కుటుంబానికి పోషించుకోవడానికి తునికాకు సేకరణకు వెళ్లి అడవిదున్న దాడిలో గాయపడిన సృజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తుడందెబ్బ రాష్ట్ర ఆధ్యక్షుడు వట్టం ఉపేందర్ కోరుతున్నారు.