పంచలోహ విగ్రహం పెట్టిస్తం: ప్రధాని మోడీ

పంచలోహ విగ్రహం పెట్టిస్తం: ప్రధాని మోడీ
  • ఈశ్వర చంద్ర విగ్రహ ధ్వంసం టీఎంసీ గూండాల పనే
  • దీదీ వైఖరిని దేశమంతా చూస్తోంది
  • ఎస్పీ, బీఎస్పీ పొత్తును ప్రజలు స్వాగతించరు
  • కొందరు ‘కిచిడి’ గవర్నమెంట్‌‌  కోరుకుంటున్నారు
  • వాళ్ల ప్రయత్నాలు ఫలించవు
  • యూపీలో ప్రధాని నర్రేంద మోడీ

పశ్చిమబెంగాల్‌ లో టీఎంసీ గూండాలు ధ్వంసం చేసిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని అదే చోట తిరిగి ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌‌లోని మవులో గురువారం ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. కోల్‌‌కతాలో విగ్రహాన్ని పడగొట్టిన చోటే పెద్ద పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా టీఎంసీ సృష్టించిన విధ్వంసాన్ని దేశమంతా చూసిందని, వారే విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. అందుకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ప్రధాని అన్నారు. గతంలో వెస్ట్‌‌ మిడ్నాపూర్‌‌, ఠాకూర్‌‌నగర్‌‌లో ప్రచారం చేస్తున్నప్పుడు టీఎంసీ కార్యకర్తల గూండాయిజం వల్ల తాను ఎన్నికల ప్రచారాన్ని మధ్యలో నిలిపివేయాల్సి వచ్చిందని మోడీ చెప్పారు.

‘ఓ సారి బెంగాల్‌‌లోని కూచ్‌‌ బిహర్‌‌లో బీజేపీ పెద్ద ర్యాలీ ప్లాన్‌‌ చేసింది. అదే చోట మమత మరో ర్యాలీని ప్లాన్‌‌ చేసి పోటీ రాజకీయం చేశారు. నేను ఎప్పటి నుంచో ఆమె వైఖరిని గమనిస్తున్నా. కానీ ఇప్పుడు అదే వైఖరిని దేశమంతా చూస్తోంది’ అని మోడీ అన్నారు. ‘త్వరలో బెంగాల్‌‌లోని డండంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించాల్సి ఉంది. అందుకు బెంగాల్‌‌ సీఎం అనుమతిస్తుందో లేదో చూడాలి. అసలు నా హెలికాప్టర్‌‌ను దిగనిస్తుందో లేదోననే అనుమానం ఉంది’ అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిపైనా మోడీ విమర్శలు చేశారు. ‘ఉత్తరప్రదేశ్, బీహార్, పూర్వాంచల్ ప్రజలను బయట వ్యక్తులని మమత అంటున్నారు. దీన్ని మాయావతి వ్యతిరేకించాల్సింది పోయి సమర్థిస్తున్నారు. బెంగాల్‌‌లో జరిగిన విధ్వంసంపైనా ఆమె మాట్లాడడం లేదు’ అని మోడీ అన్నారు.

‘ఎస్పీ, బీఎస్పీలు ప్రజలకు ఎంత నష్టం చేయాలో అంతా చేశాయి. జరుగుతున్నదంతా చూసి వాళ్లిప్పుడు నిరాశలో కూరుపోయారు’ అని ప్రధాని విమర్శించారు. ‘మహా కూటమి అవినీతి గురించి అందరికీ తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే మోడీ హఠావో నినాదం ఎత్తుకున్నారు.  కేంద్రంలో  బలహీన ప్రభుత్వాన్ని వారంతా కోరుకుంటున్నారు. కిచిడి ప్రభుత్వం ఏర్పాటైతే బ్లాక్‌‌మెయిల్‌‌ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. ‘ఎస్పీ, బీఎస్పీలది అవకాశవాద పొత్తు. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నాయకులు కుమ్ములాడుకుంటున్నారు.’ అని మోడీ చెప్పారు. గతంలో కులాల పేరిట రాజకీయాలు చేసి అధికారం చేజిక్కించుకుని తర్వాత పట్టించుకోలేదని మోడీ విమర్శించారు. అత్యాచారం కేసులో నిందితుడికి ఎస్పీ, బీఎస్పీ కూటమి టికెట్‌‌ ఇచ్చి ఘోషీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలబెట్టిందన్నారు.

ఈసీ ఆటబొమ్మయితే దీదీ సీఎం అయ్యేదా?: మోడీ

ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని ప్రధాని నరేంద్ర మోడీ తప్పుపట్టారు. లెఫ్ట్​ పార్టీలతో పోరాడిన రోజుల్లో ఇదే మమత, కేంద్ర బలగాల సాయం కోరారని, ఈసీ పక్షపాతంగా వ్యవహరించి ఉంటే ఆమె సీఎం అయ్యిండే వారే కాదని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారం చివరిరోజైన గురువారం బెంగాల్​లో మోడీ రెండు బహిరంగ సభల్లో పా ల్గొ న్నారు. మమతతోపాటు ఆమె మేనల్లుడు అభిషేక్​ బెనర్జీపైనా విమర్శలు గుప్పించారు.

‘‘బీజేపీ నేతల్ని ఔట్​సైడర్స్​(బయటి వ్యక్తు లు)గా దీదీ ఎద్దేవా చేస్తున్నారు. బెంగాల్​, ఇండియాలో ఒక భాగం. ఇదేమీ ఆ అత్తాఅల్లుళ్ల జాగీరు కాదు. యూపీ, బీహార్ నుం చి వచ్చే వాళ్లపై ఔట్​సైడర్స్​ ముద్రవేసే ఆమె, విదేశీ చొరబాటుదారులను మాత్రం అక్కున చేర్చుకుంటా రు. టీఎంసీ సర్కారు అక్రమాలు భరించలేకే బెంగాలీలు మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడి 42 లోక్​సభ సీట్లలో బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలవబోతున్నది. ఓటమి గ్ యారంటీ అని అర్థమైంది కాబట్టే దీదీ ఫ్రస్ట్రేషన్​లో టీఎంసీ గుం డాలతో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చేసిన టీఎంసీ గుం డాలను కాపాడేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సాక్ష్యాధారాల్ని మాయం చేశారు”అని మోడీ చెప్పుకొచ్చారు.