
కోల్‌కతా: బెంగాల్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ టీకాను అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాని మమత చెప్పారు. కరోనా పరిస్థితుల్లో సేవలందిస్తున్న హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సరైన సమయానికి హెల్త్‌కేర్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్నారు.