స్టూడెంట్స్‌కు కరోనా సోకబోదని హామీ ఇవ్వగలరా?

స్టూడెంట్స్‌కు కరోనా సోకబోదని హామీ ఇవ్వగలరా?

సర్కార్‌‌కు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ప్రశ్నలు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించనుండటంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పరీక్షలపై ముందుకెళ్లడం ఏంటని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ఈ విషయంపై తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందించారు. 25 లక్షల మంది విద్యార్థుల హెల్త్, సేఫ్టీని రిస్క్‌లో పెట్టి ఎగ్జామ్స్‌ను నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎగ్జామ్స్‌ సమయంలో స్టూడెంట్స్‌కు కరోనా సోకబోదని మోడీ గవర్నమెంట్ హామీ ఇవ్వగలదా అని సూర్జేవాలా ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ప్రోటోకాల్స్ పాటిస్తున్నారో చెప్పాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 6 వరకు జేఈఈ,13న నీట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో తగు జాత్రత్తల మధ్య ఈ ఎగ్జామ్స్‌ను నిర్వహించడానికి కేంద్రం సమాయత్తమవుతోంది.