ఫిబ్రవరి తర్వాత మూతపడనున్న పేటీఎం బ్యాంక్!

 ఫిబ్రవరి తర్వాత  మూతపడనున్న పేటీఎం బ్యాంక్!

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు:  పేటీఎం పేమెంట్స్‌‌‌‌ బ్యాంక్ ఫిబ్రవరి తర్వాత తన బ్యాంకింగ్ లైసెన్స్‌‌‌‌ను కోల్పోయే అవకాశం ఉందని రిపోర్ట్స్ వెలువడుతున్నాయి. బ్యాంకింగ్  రూల్స్ ఫాలో కావడంలో విఫలమవ్వడంతో ఈ బ్యాంక్ కార్యకలాపాలను ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ నిషేధించిన విషయం తెలిసిందే. యూపీఐ, ఐఎంపీఎస్‌‌‌‌, ఆధార్‌‌‌‌‌‌‌‌ ఎనబుల్డ్‌‌‌‌ పేమెంట్ సిస్టమ్‌‌‌‌ (ఏఈపీఎస్‌‌‌‌) వంటి అన్ని బిల్లు పేమెంట్ సర్వీస్‌‌‌‌లను కూడా ఫిబ్రవరి 29 తర్వాత నుంచి ఆపేయాలని, డిపాజిట్లను సేకరించకూడదని, లోన్లు ఇవ్వకూడదని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌ను  హెచ్చరించింది.  ఇప్పటికే ఉన్న కస్టమర్లు తమ డిపాజిట్లను విత్‌‌‌‌డ్రా చేసుకునేంత వరకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వెయిట్ చేస్తుందని, ఆ తర్వాత బ్యాంకింగ్ లైసెన్స్‌‌‌‌ రద్దు చేస్తుందని బ్లూమ్‌‌‌‌బర్గ్‌‌‌‌ రిపోర్ట్ చేసింది. కానీ, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌ ప్రతినిధులు, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ మధ్య చర్చలు జరుగుతున్నాయి. సూపర్‌‌‌‌‌‌‌‌వైజరీలో భాగంగానే ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తాజా చర్యలు తీసుకుందని ఈ బ్యాంక్ చెబుతోంది.   ఈ బ్యాంక్‌‌‌‌లో పేటీఎం (వన్‌‌‌‌97 కమ్యూనికేషన్స్‌‌‌‌) కు 49 శాతం వాటా ఉంది.  

రూల్స్ ఫాలోకాకపోవడంతోనే..

 తాజాగా బ్యాంక్ సర్వీస్‌‌‌‌లను నిలిపేయడం సడెన్‌‌‌‌గా తీసుకున్న నిర్ణయం కాదని ఎనలిస్టులు పేర్కొన్నారు. గత ఏడేళ్లుగా  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ అనేకసార్లు వార్నింగ్ ఇచ్చిందని అన్నారు.  పేటీఎం పేమెంట్స్‌‌‌‌ బ్యాంక్  కేవైసీ (నో యువర్ కస్టమర్) రూల్స్‌‌‌‌ను సరిగ్గా ఫాలో  కావడం లేదు. వేల మంది కస్టమర్లు సింగిల్ పాన్ కార్డుతోనే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను ఓపెన్ చేశారు.   మినిమమ్‌‌‌‌ కేవైసీ రూల్స్ ఫాలో అయ్యే   ప్రీపెయిడ్ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్స్‌‌‌‌ (వాలెట్లు వంటివి) తో  కోట్ల రూపాయిల్లో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని  సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  పేటీఎం పేమెంట్స్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కు    ఏకంగా  35 కోట్ల ఈ–వాలెట్ అకౌంట్లు ఉన్నాయి. ఇందులో 31 కోట్ల అకౌంట్లు డోర్మెంట్‌‌‌‌ (వాడకుండా) లో ఉన్నాయని అంచనా.  నాలుగు కోట్ల ఈ–వాలెట్‌‌‌‌ అకౌంట్లలో జీరో బ్యాలెన్స్  లేదా తక్కువ బ్యాలెన్స్‌‌‌‌ ఉంది. డోర్మెంట్ అకౌంట్లు ఎక్కువగా ఉంటే  మనీలాండరింగ్‌‌‌‌ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కైవైసీలో సమస్యల వలన డిపాజిటర్లు, వాలెట్ హోల్డర్లు నష్టపోయే అవకాశం ఉంది. మనీలాం డరింగ్‌‌కు సంబంధించి పేటీఎంను ఈడీ దర్యాప్తు చేస్తుందని కూడా ప్రభుత్వం పేర్కొంది. ‘పేటీఎం పేమెంట్స్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లో పెద్ద మొత్తంలోని కస్టమర్లకు కేవైసీ  జరగలేదు. చాలా అకౌంట్లకు పాన్ వాలిడేషన్ పూర్తవ్వలేదు. సింగిల్ పాన్ నెంబర్‌‌‌‌‌‌‌‌పై  అనేక అకౌంట్లు ఓపెనై ఉన్నాయి. భారీ సంఖ్యలో డోర్మెంట్ అకౌంట్లు ఉన్నాయి. మనీలాండరింగ్‌‌‌‌ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ట్రాన్సాక్షన్లు  మానిటర్‌‌‌‌ చేయడానికి సరియైన సిస్టమ్‌‌‌‌ లేదు’ అని ఎనలిస్టులు అన్నారు.

ఏడేళ్లుగా ఇబ్బందుల్లోనే..

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌ను  2017 లో వన్‌‌‌‌97 కమ్యూనికేషన్స్ (పేటీఎం పేరెంట్ కంపెనీ) ఏర్పాటు చేసింది. డీమానిటైజేషన్ తర్వాత ఈ బ్యాంక్ పాపులర్ అయ్యింది. ఈ సంస్థ మనీ లాండరింగ్‌‌‌‌పై   బ్యాంకింగ్ రూల్స్‌‌‌‌ను సరిగ్గా ఫాలో కాలేదని, పేరెంట్ కంపెనీకి దూరంగా ఉండలేదని, ఫ్రాడ్స్‌‌‌‌ను అరికట్టడంలో సరిగ్గా పనిచేయలేదని  ఎనలిస్టులు పేర్కొన్నారు. లైసెన్సింగ్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌ను ఉల్లంఘించిందని అన్నారు. మనీ లాండరింగ్‌‌‌‌ను గుర్తించేందుకు  తగిన సిస్టమ్‌‌‌‌ ఈ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు.  బ్యాంకింగ్ రెగ్యులేషన్స్‌‌‌‌ను  ఉల్లంఘించిందని గుర్తించిన తర్వాత 2018 లో  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ బిజినెస్ రిస్ట్రిక్షన్లు పెట్టింది. బ్యాంక్‌‌‌‌ సబ్మిట్ చేసిన రిపోర్ట్స్‌‌‌‌ సరిగ్గా లేవని గుర్తించడంతో కొత్త కస్టమర్లను ఆన్‌‌‌‌బోర్డ్‌‌‌‌ చేసుకోవడంపై 2022 లో రిస్ట్రిక్షన్లు పెట్టింది. ఎక్స్‌‌‌‌టర్నల్ ఆడిటర్లను నియమించి, పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టింది.

 పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌ను కొనడంపై ఎటువంటి చర్చలు జరప లేదు. మాతో వీరు కొన్ని అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు. పేమెంట్ ఎకోసిస్టమ్‌‌‌‌లో ఎటువంటి అంతరాయాలు లేకుండా చూడడానికి మర్చంట్లకు   వెల్‌‌‌‌కమ్ చెబుతున్నాం. మా దగ్గర ఎస్‌‌‌‌బీఐ పేమెంట్‌‌‌‌ ఉంది. ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ సేల్‌‌‌‌ టెర్మినల్స్‌‌‌‌, క్యూఆర్‌‌‌‌‌‌‌‌ కోడ్స్‌‌‌‌, లేదా యాప్ బేస్డ్ సొల్యూషన్లను అందిస్తోంది.  ఎస్‌‌‌‌బీఐకి అకౌంట్లు షిఫ్ట్ చేసుకోవడంపై  మర్చంట్లను ఆహ్వానిస్తున్నాం 
-

 దినేష్  ఖారా, ఎస్‌‌‌‌బీఐ చైర్మన్‌‌‌‌