ఇండియాలో వాట్సాప్కు కాలం చెల్లిందా..? టెక్ దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న ఇండియా మేడ్ Arattai యాప్ !

ఇండియాలో వాట్సాప్కు కాలం చెల్లిందా..? టెక్ దిగ్గజాలకు దడ పుట్టిస్తున్న ఇండియా మేడ్ Arattai యాప్ !

టారిఫ్ లు.. సాంక్షన్లు.. వీసా రెగ్యులేషన్స్ తో ఇండియాను భయపెట్టాలని చూస్తున్న అమెరికాకు.. ఆ దేశానికి చెందిన టెక్ దిగ్గజ కంపెనీలకు ఇది షాకింగ్ న్యూస్. ప్రపంచలోనే రెండవ అతిపెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీ ఇండియాపై సర్వీసెస్ లో గానీ.. బిజెనెస్ లో గానీ ఆధారపడుతూ.. చివరికి భారత్ కు తీవ్ర డ్యామేజ్ కలిగించాలని చూస్తున్న యూఎస్.. అంతర్మథనంలో పడే పరిస్థితి వచ్చిందని ప్రస్తుతం ఇండియాలో ట్రెండ్ అవుతున్న యాప్ గురించి చర్చిస్తే తెలుస్తుంది. 

గూగుల్, మైక్రోసాప్ట్, ఫేస్  బుక్, వాట్సాప్, ఎక్స్.. ఇలా యాప్స్, సాఫ్ట్ వేర్ ఏదైనా మనం అమెరికాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అదే విధంగా అమెరికా కంపెనీలకు బిజినెస్ చేసుకోడానికి ఇండియా అతి పెద్ద ప్లాట్ ఫామ్. అయినప్పటికీ ఇండియాను దెబ్బకొట్టాలని అమెరికా చూస్తుండటంతో.. ఇండియన్స్ విసిగిపోయే పరిస్థితి వచ్చింది. మనమే మన సొంత టెక్నాలజీ.. యాప్స్ ను వాడుకుంటే పోలా.. అన్న ఆలోచనకు అటు గవర్నమెంటుతో పాటు ఇటు కామన్ పీపుల్ కూడా వచ్చారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఇండియాలో.. ఇక్కడే డెవలప్ చేసిన యాప్ ఒకటి ఫుల్లుగా ట్రెండ్ అవుతోంది. వాట్సాప్ కు పోటీగా వచ్చిన అరత్తాయ్ (Arattai) అనే యాప్.. ఇప్పుడు ఇండియాలో వాట్సాప్ కు చెక్ పెడుతుందా అన్నట్లుగా మోస్ట్ ట్రెండింగ్ లో.. యూజింగ్ లోకి వచ్చేసింది. 

ALSO READ : దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్..

ఏంటి Arattai యాప్..?

అరత్తాయ్ యాప్.. ఇప్పుడు ఇండియాలో అత్యంత స్పీడ్ లో దూసుకుపోతున్న లోకల్ మేడ్ యాప్. రోజుకు 3 వేల సైన్ అప్స్ నుంచి 3 లక్షల 50 వేల మంది సైన్ అప్ అవుతూ వాట్సాప్ కు దడ పుట్టిస్తున్న యాప్ ఇది. కేవలం రెండు మూడు రోజుల్లోనే 100 రెట్లు పెరిగిపోవడం చూసి ప్రపంచ వ్యాప్తంగా టెక్ ఎక్స్పర్ట్స్ షాకవుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, సోషల్ మీడియా బజ్, ప్రైవసీ, స్పై వేర్ ఫ్రీ ఆల్టర్నేటివ్ కావడంతో ఈ యాప్ ఇప్పుడు అత్యంత వేగంగా దూసుకుపోతోంది. 

ఎందుకు Arattai స్పెషల్..?

Arattai  యాప్ అంటే తమిళంలో క్యాజువల్ చాట్ అని అర్థం. ఇది కొత్త యాపేం కాదు. చెన్నై బేస్డ్ సాఫ్ట్ వేర్ కంపెనీ జోహో (Zoho) ఈ యాప్ ను 2021 లోనే ఒక ప్రాజెక్టు కింద తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ట్రాక్షన్ అందుకుంది. వాట్సాప్ లో ఉండే అన్ని రకాల చాట్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. వన్ టు వన్, గ్రూప్ చాట్స్, వాయిస్ నోట్స్, ఇమేజ్, వీడియో షేరింగ్, స్టోరీస్, బ్రాడ్ కాస్ట్ ఛాన్నెల్స్, ఇలా అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి ఇందులో. 


వాట్సాప్ లో ఉండే ఫీచర్స్ ఉన్నాయి.. ఇందులో స్పెషలేముందని అనకండి.. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే.. ఫస్ట్ ఇది మేడ్ ఇన్ ఇండియా యాప్. రెండవది స్పై వేర్ అవసరం లేకుండా పనిచేస్తుంది. ఇందులో ప్రైవసీకి మొదటి ప్రాధాన్యత , గ్యారెంటీ ఉంటుందని పేరెంట్ కంపెనీ జోహో చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ గెయింట్స్ కంపెనీలను స్పై వేర్స్ భయపెడుతున్న కాలంలో.. హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం స్పెషల్. 

ఎందుకు ఇంత ట్రెండింగ్..?

ఈ యాప్ ను జోహో కంపెనీ 2021 లోనే లాంచ్ చేసినా.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన కామెంట్స్ తో పాపులారిటీలోకి వచ్చిందని చెప్పాలి. స్థానికంగా తయారైన డిజిటల్ సొల్యుషన్స్ ను వాడాలని మంత్రి కోరడంతో ట్రాక్షన్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు. గవర్నమెంట్ మద్ధతుతో ఇప్పుడు iOS, Andoid యాప్ స్టోర్ లలో నెంబర్ 1 డౌన్ లోడ్ అవుతున్న యాప్ గా ట్రెండింగ్ లో ఉంది. 

ఈ సందర్భంగా కేవలం మూడు రోజుల్లోనే వంద రెట్లు సబ్ స్క్రిప్షన్లు పెరిగినట్లు కంపెనీ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు చెప్పారు. ఈ యాప్ ట్రెండింగ్ లోకి రావడంతో ట్రాఫిక్ ఘోరంగా వస్తోందని.. మిలియన్లలో యూజర్లు డౌన్ లోడ్ చేసుకుంటున్నారని చెప్పారు. దీని కారణంగా యాప్ పై కాస్త ప్రెజర్ పెరిగినట్లు చెప్పారు. కొంత మంది డౌన్ లోడ్ చేసుకుని సైన్ అప్ చేసుకునే టైమ్ లో ఓటీపీ ఎంట్రీ డిలే చేయడం.. కాంటాక్ట్ సింకింగ్ ఇష్యూ, కాల్ ఫెయిల్యూర్ వస్తున్నట్లు కంపెనీ చెప్పింది. వాస్తవానికి 2025 నవంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేద్దామనుకున్నామని.. ముందుగానే గ్రోత్ మొదలైందని చెప్పారు. చిన్న చిన్న సమస్యలను రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు చెప్తున్నారు. 

వాట్సాప్ ను ఓవర్ టేక్ చేస్తుందా..?

Arattai యాప్ ట్రెండింగ్ లోకి రావడం తో WhatsApp కు ఇండియాలో కాలం చెల్లినట్లే అనే చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. నిజంగా ఓవర్ టేక్ చేస్తుందా..? అనేదే అసలు ప్రశ్న. 

ఇండియాలో వాట్సాప్ కు 500 మిలియన్ల యూజర్లు ఉన్నారు. అంటే 50 కోట్ల మంది భారతీయులు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. డైలీ చాట్, ఫామిలీ, ఫ్రెండ్స్, ఆఫీస్, గ్రూప్స్, బిజినెస్.. ఇలా అన్ని విషయాల్లో మనోళ్లు  వాట్సాప్ కు అలవాటు పడిపోయి ఉన్నారు. అరత్తాయ్ యాప్ గ్రోత్ చూస్తే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నప్పటికీ.. ఈ పాపులారిటీ ఎన్నాళ్లు నిలుస్తుంది.. అదే విధంగా ఇప్పటికే ఈజీగా వినియోగిస్తున్న వాట్సాప్ కంటే బెటర్ గా ప్లాట్ ఫామ్ ను అందిస్తుందా అనేదే మెయిన్ ఛాలెంజ్.

మరో విషయం ఏమిటంటే.. వాట్సాప్ లో ఎండ్ టూ ఎండ్ ఎంక్రిప్షన్ ఉంటుంది. అంటే సెండర్, రిసీవర్ తప్ప మధ్యలో ఎవరూ ఫోటోస్, మీడియా, చాట్స్ ను ఓపెన్ చేయలేరు. హ్యాక్ చేయలేరు. అలాంటి ఫీచర్ ను Arattai అందిచగలదా అని. ఆ ఫీచర్ అందించనంత వరకు రీప్లేస్ చేయడం అనేది కష్టమైన పనే. పేరెంట్ కంపెనీ జోహో.. ఎంత వేగంగా.. ఎంత పర్ఫెక్ట్ గా ప్రైవసీ ఇష్యూని డెవలప్ చేసి.. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను డెవలప్ చేస్తుందో.. దానిపై ఆధారపడి భవిష్యత్ ఉంటుంది. చూడాలి మరి మున్ముందు ఈ జోరును ఎంత వరకు నిలుపుకుంటుందో.