భారత రత్న గ్రహీతలకు నగదు బహుమతి ఉంటుందా..బెనిఫిట్స్ ఎలా ఉంటాయి

భారత రత్న గ్రహీతలకు నగదు బహుమతి ఉంటుందా..బెనిఫిట్స్ ఎలా ఉంటాయి

భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. విభిన్న రంగాల్లో వ్యక్తులు చేసిన అసాధారణ సేవ, పనితీరును  ప్రశంసిస్తూ ఈ అవార్డును ప్రతి యేటా ప్రదానం చేస్తారు. ఈ ఏడాదికి (2024) గాను మాజీ ప్రధాని పీవీ నరసింహారావు,మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాగూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న అవార్డు దక్కింది. అయితే భారత రత్న అవార్డు గ్రహీతలకు లభించే సౌకర్యాలు, బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. 

భారతరత్న ప్రైజ్ మనీ 

భారతరత్న గ్రహీతలకు ఎలాంటి ద్రవ్య గ్రాంట్ లేదు. రాష్ట్రపతి సంతకంచేసిన సనద్(సర్టిఫికెట్), పతకాన్ని దేశానికి చేసిన సేవలకు గుర్తుగా అందజేస్తారు. 

భారతరత్న గ్రహీతకు కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రయోజనాలు లభిస్తాయి. 

  • భారతరత్న అవార్డు గ్రహీతలకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ Z+ కేటగిరి భద్రత కల్పిస్తుంది. 
  • భారత చీఫ్ జస్టిస్  జీతానికి సమానమైన మొత్తాన్ని జీవితకాల పెన్షన్ గా అందిస్తారు. 
  • అధికారిక ప్రోటోకాల్ లిస్ట్ లో భారతరత్న గ్రహీతలకు స్థానం ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో వీరికి ఏడవ స్థానం. 
  • జీవిత కాలం విమానాల్లో విఐపీ హోదాతో ప్రయాణం 
  • ప్రభుత్వం పరంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా ప్రోటోకాల్ జాబితాలో భారత రత్న అవార్డు గ్రహీతలు ..రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సంబంధిత రాష్ట్ర గవర్నర్, మాజీ  రాష్ట్రపతులు, ఉప ప్రధానులు, లోక్ సభ స్పీకర్ తో పాటు భారత చీఫ్ జస్టిస్ ల తోపాటు 7వ స్థానంలో అరుదైన గౌరవం దక్కుతుంది. 
  • అవార్డు గ్ర హీతలకు పతకం, రాష్ట్రపతి సంతకంతో కూడిన సర్టిఫికెట్లను అందజేస్తారు. పతకంపై 
  •  అవార్డు గ్రహీతలు మరణిస్తే  ప్రభుత్వం లాంఛనాలతో ఆర్మీ గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

అవార్డు ఎలా ఉంటుంది 

భారత రత్న అవార్డును కాంస్యంతో తయారు చేస్తారు. దీనిని ప్రఖ్యాత కళాకారుడు నందలాల్ బోస్ రూపొందించారు.  ఈ పురస్కారం రావిచెట్టు ఆకు ఆకారంలో ఉంటుంది. దానిపై ఒకవైపు ప్లాటినంతో చెక్కిన సూర్యుడి చిత్ర, కింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. పతకానికి మరోవైపు అశోక స్తంభం, కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంంది. 

ఎంపిక విధానం

భారతరత్న కు వ్యక్తుల పేర్లను ప్రధానమ మంత్రి ఎంపిక చేసి రాష్ట్రపతి కి పంపిస్తారు. రాజకీయాలు, విద్య, సైన్స్, ఆర్ట్స్, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ, శాంతి వంటి వివిధ రంగాలలలో ప్రతిభ, విశిష్టసేవలందించిన వారిని ఈఅవార్డుకు ఎంపిక చేస్తారు. ఈఅవార్డుకు జాతీయతతో సంబంధం ఉండదు. అందుకే విదేశీయులకు కూడా భారతరత్న ప్రకటిస్తారు.