జాతీయ జెండాను ఇండియాలో గాక పాక్‌‌లో ఎగరేయాలా?

V6 Velugu Posted on Mar 12, 2021

న్యూఢిల్లీ: జాతీయ జెండాను మన దేశంలో గాక పాకిస్థాన్‌‌లో ఎగరేయాలా అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశభక్తిపై ఎవరూ రాజకీయం చేయరాదని, ఈ దేశం అందరిదంటూ స్పష్టం చేశారు. 

‘ఢిల్లీలో 500 చోట్ల జాతీయ జెండాను ఎగరేస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం. జాతీయ జెండాను చూసినప్పుడల్లా బార్డర్‌లో పహారా కాస్తున్న సైనికులను గుర్తు చేసుకుంటాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ దీనికి బీజేపీ, కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. వారి సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. మా నిర్ణయానికి వారు మద్దతు ఇవ్వాలి. దేశభక్తి మీద రాజకీయాలు ఎందుకు? ఈ దేశం అందరిదీ. మన దేశ జాతీయ జెండాను ఇక్కడ కాకపోతే పాకిస్థాన్‌‌లో ఎగరేయాలా ఏంటి?’ అని కేజ్రీవాల్ చెప్పారు. 

Tagged CM Arvind Kejriwal

Latest Videos

Subscribe Now

More News