మోడీ, అమిత్ షా ప్రచారం చేసినా గెలుపు నాదే : సిద్ధరామయ్య

మోడీ, అమిత్ షా ప్రచారం చేసినా గెలుపు నాదే : సిద్ధరామయ్య

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వచ్చి ప్రచారం చేసినా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ 140 నుంచి 150 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపడుతుందని అన్నారు. వయోభారం కారణంగా ఈసారి బాదామి నుంచి పోటీ చేయడం లేదని, కోలార్‌ స్థానం నుంచి బరిలో దిగుతున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ షా ఇతర బీజేపీ నాయకులు తనను ఓడించేందుకు తీవ్రంగా ప్రచారం చేసినప్పటికీ తాను విజయం సాధించిన విషయాన్ని సిద్ధరామయ్య గుర్తు చేశారు. అప్పట్లో ఆయన చాముండేశ్వరి, బాదామి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. చాముండేశ్వరి సీటులో జేడీ(ఎస్) అభ్యర్థి దేవెగౌడపై 36,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోగా, బాదామిలో బీజేపీకి అభ్యర్థి బీ శ్రీరాములుపై 1,700 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు.