ఈ మాస్క్ చాలా స్మార్ట్.. ధర @ 22వేలు

V6 Velugu Posted on Apr 08, 2021

  • ఇవాళే మార్కెట్లో రిలీజ్

కరోనా వచ్చిన తర్వాత మాస్క్ మస్ట్ అయింది. ఈ క్రమంలో ఎన్నో రకాల మాస్క్ లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే లెటెస్ట్ టెక్నాలజీతో తయారైన స్మార్ట్ మాస్క్ గురువారం మార్కెట్ లోకి రానుంది. దీని ధర రూ.22 వేలు (299 అమెరికన్ డాలర్లు). అమెరికన్ ర్యాపర్ విలియం ఆడమ్స్.. హనీవెల్ కంపెనీ, హాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ జోస్ ఫెర్నాండేజ్, మరికొందరితో కలిసి దీన్ని రూపొందించారు. ‘‘మనం సైన్స్ అండ్ ఫిక్షన్ యుగంలో ఉన్నాం. కానీ మనం ధరిస్తున్న మాస్కులు పాత కాలం వాటిలా ఉన్నాయి. అందుకే మోడ్రన్ స్టైల్ కు అనుగుణంగా లెటెస్ట్ టెక్నాలజీతో సూపర్ మాస్క్ ను తయారు చేశాం” అని విలియం ఆడమ్స్ చెప్పారు. 2020 సమ్మర్ లో దీని తయారీని ప్రారంభించామన్నారు. 
ఇవీ ప్రత్యేకతలు.. 
ఇదొక సిలికాన్ మాస్క్. బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే, 7 గంటలు వస్తుంది. మాస్క్ లోపల చిన్న ఫ్యాన్ తో పాటు ఎయిర్ ఫిల్టర్లు ఉంటాయి. ఇందులో అత్యాధునిక హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇవి యాపిల్ ఎయిర్ పాడ్స్ తరహాలో పని చేస్తాయి. ఇక మాస్క్ ముందు భాగంలో ఎల్ఈడీ లైట్ కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో ఇది మనకెంతో ఉపయోగపడుతుంది. సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలాస్టిక్ స్ట్రిప్ ఉంటుంది. రెండు కలర్ వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. వైట్, గ్రే, ఆరెంజ్ తో పాటు బ్లాక్, బ్లాక్–ఆరెంజ్ వేరియంట్లలో దీన్ని రూపొందించారు. 
అలా ఐడియా... 
విలియం ఆడమ్స్ స్పేస్ హెల్మెట్ లాంటి మాస్క్ ను టీవీ షోలో ప్రదర్శించగా.. సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనీఫ్ చూశారు. దాన్నుంచే ఆయనకు ఈ సూపర్ మాస్క్ ఐడియా వచ్చింది. దీంతో బెనీఫ్ హనీవెల్ సీఈఓతో కలిసి ఆడమ్స్ ను సంప్రదించారు. అందరూ కలిసి టీమ్ గా ఏర్పడి స్మార్ట్ మాస్క్ ను రూపొందించారు. బ్లాక్ పాంథర్, ది అవెంజర్స్, ఎక్స్ మెన్ 2 లాంటి సినిమాలకు పని చేసిన, స్పేస్ ఎక్స్ వైట్ సూట్ ను డిజైన్ చేసిన హాలీవుడ్ డిజైనర్ జోస్ ఫెర్నాండేజ్ కు ఈ మాస్క్ డిజైన్ బాధ్యతలు అప్పగించారు.
 

Tagged coronavirus, corona mask, charging mask, mask price

More News