విలియమ్సన్‌‌ డబుల్‌‌ సెంచరీ

విలియమ్సన్‌‌ డబుల్‌‌ సెంచరీ

కరాచీ: పాకిస్తాన్‌‌తో తొలి టెస్ట్‌‌లో న్యూజిలాండ్‌‌ భారీ ఆధిక్యం సాధించింది. మాజీ కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ (200 నాటౌట్‌‌) డబుల్‌‌ సెంచరీతో చెలరేగడంతో 440/6 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో గురువారం నాలుగో రోజు ఆట కొనసాగించిన కివీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ను 194.5 ఓవర్లలో 612/9 స్కోరు వద్ద డిక్లేర్‌‌ చేసింది. దీంతో న్యూజిలాండ్‌‌కు 174 రన్స్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ లీడ్​ దక్కింది. ఇష్‌‌ సోధీ (65) రాణించాడు.  

పాక్‌‌ బౌలర్లలో అబ్రార్‌‌ అహ్మద్‌‌ 5, నౌమన్‌‌ అలీ 3 వికెట్లు తీశాడు. తర్వాత పాక్​ ఆట చివరకు రెండో ఇన్నింగ్స్‌‌లో 77/2 స్కోరు చేసింది. ఇమాముల్‌‌ (45 బ్యాటింగ్‌‌), నౌమన్‌‌ (4 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.