ఇంట్లోని కిటికీల కర్టెన్స్‌ను పదే పదే చేత్తో తీయడం, మూయడం కాస్త విసుగుతో కూడుకున్న పని. అలాంటప్పుడు ఈ గాడ్జెట్ ఉంటే ఎలాంటి శ్రమ లేకుండా, ఉన్నచోటు నుంచే వాటిని ఆపరేట్ చేయొచ్చు. కెర్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ గాడ్జెట్‌కి కర్టెన్‌ని అటాచ్ చేయాలి. ఆ తర్వాత దాన్ని రిమోట్ లేదా ఫోన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఈ స్మార్ట్ మోటార్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఇచ్చే వాయిస్ కమాండ్స్‌తో కూడా పనిచేస్తుంది. అందువల్ల ప్రపంచంలో ఎక్కడినుంచైనా ఆపరేట్ చేయొచ్చు.
గూగుల్ వాయిస్ తో కిటికీ కర్టెన్లు
వన్-టచ్ మాన్యువల్ కంట్రోల్ ఫీచర్ ఉండడం వల్ల పరదాలను చేత్తో తేలికగా లాగినా అది ఆటోమేటిక్‌గా ఓపెన్ లేదా క్లోజ్ అవుతుంది. ఇది పెద్ద పెద్ద శబ్దాలు కూడా చేయదు. సైలెంట్‌గా దాని పని అది చేసుకుంటుంది. కాంపాక్ట్, మెటల్, ప్లాస్టిక్ బిల్డ్ డిజైన్ ఇంటికి మాడ్రన్ లుక్‌ను ఇస్తుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. ప్రస్తుతం దీని ధర మార్కెట్ లో
రూ.5 వేల899 లు.
స్మార్ట్ ఫోన్ తో గ్యాస్ పొయ్యి
స్మార్ట్ వాల్వ్ కొన్నిసార్లు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేయడం మరిచిపోతుంటాం. అలాంటప్పుడు పైప్ నకు ఈ గాడ్జెట్‌ని బిగించుకుంటే సరిపోతుంది. దీని ద్వారా ఉన్నచోటు నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా గ్యాస్ లేదా వాటర్ పైపుల వాల్వ్‌లను సులభంగా కంట్రోల్ చేయొచ్చు. దీన్ని ఎక్స్‌ప్రెస్ అనే బ్రాండ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ వాల్వ్ కంట్రోలర్‌ను అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు.
ఇందులో టైమర్ /షెడ్యూలింగ్ ఫీచర్ ఉంటుంది. దానివల్ల నిర్ణయించిన టైంకి వాల్వ్ ఆటోమేటిక్‌గా ఆన్ లేదా ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెంట్ పోతే దీని కింద ఉండే ఒక ప్రత్యేకమైన పుల్ రింగ్ (మాన్యువల్ క్లచ్) సాయంతో చేత్తోనే వాల్వ్‌ను తిప్పుకునే వెసులుబాటు ఉంది. ఇది 0.5 అంగుళం నుంచి 1.5 అంగుళాల వరకు వ్యాసం కలిగిన అన్ని రకాల గ్యాస్, వాటర్, లిక్విడ్ పైపుల వాల్వ్‌లకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. దీన్ని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేయడం వల్ల చాలా మన్నికగా ఉంటుంది. ప్యాకేజీలో వచ్చే అడాప్టర్‌తో దీనికి ఎలక్ట్రిక్ పవర్ సప్లై చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం దీని ధర మార్కెట్ లో
రూ.2 వేల499 లు.
రిస్ట్ ఎక్సర్‌సైజర్
రోజూ కంప్యూటర్ ముందు కూర్చుని టైప్ చేయడం వల్ల లేదా ఎక్కువ సేపు మొబైల్ వాడడం వల్ల చాలామందికి మణికట్టు, చేతులు నొప్పి పుడుతుంటాయి. అలాంటప్పుడు దీంతో ఎక్సర్‌సైజ్ చేస్తే సరిపోతుంది. దీన్ని గాడ్జెట్ డీల్స్ అనే బ్రాండ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది చేతుల కండరాలను బలోపేతం చేయడమే కాకుండా ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో సాయపడుతుంది.
ఈ గైరో బాల్ వేళ్లు, మణికట్టు, ముంజేయి, భుజాల కండరాల స్ట్రెంత్‌ని కూడా పెంచుతుంది. అథ్లెట్లు, మ్యుజీషియన్స్, గేమర్స్‌కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో సెల్ఫ్-స్టార్టింగ్ మెకానిజమ్ ఉండటం వల్ల ఎలాంటి బ్యాటరీలు లేదా పవర్ కార్డ్స్ అవసరం లేదు. దీనిలోపల ఉండే రోటార్‌ను బాణం గుర్తు వైపు నెట్టి వదిలేస్తే ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది.
రోటార్ వేగంగా తిరగడం వల్ల చేయి కూడా తిరుగుతుంది. దాంతో ఎక్సర్‌సైజ్ అవుతుంది. వేగంగా తిరుగుతున్నప్పుడు చేతి నుంచి జారిపోకుండా ఉండేందుకు ఒక రిస్ట్ స్ట్రాప్ కూడా వస్తుంది. దీన్ని వాడుతున్నప్పుడు ఎల్‌ఈడీ లైట్లతో మెరుస్తూ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రస్తుతం దీని ధర మార్కెట్ లో రూ389 లు.
