నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గడువు పెంచిన వైన్స్ షాపులకు పెరగని అప్లికేషన్లు

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గడువు పెంచిన వైన్స్ షాపులకు పెరగని అప్లికేషన్లు
  • నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో  వైన్స్ ​షాపులకు 7677 అప్లికేషన్లు  
  • ఈ నెల 27 న లక్కీ డ్రా

నల్గొండ, వెలుగు: వైన్ షాపులకు దరఖాస్తులకు సర్కార్ గడువు పెంచిన ఆశించిన మేర ఆసక్తి కనిపించలేదు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వైన్స్​షాపులకు 7677 అప్లికేషన్లు వచ్చాయి  గురువారం రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారం మేరకు 247 షాపుల వచ్చిన ఆప్లికేషన్స్​ వివరాలను అధికారులు ప్రకటించారు.  ప్రస్తుతం రెండు జిల్లాలలో  247షాపులకు 7,677 అప్లికేషన్స్​ వచ్చాయి. 

దీంతో సర్కార్​కు రూ.230.31 కోట్ల ఆదాయం వచ్చిం ది. నల్గొండ జిల్లాలో 154 షాపులకు 4,906, సూర్యాపేటలో 93 షాపులకు 2,771 అప్లికేషన్స్​ వచ్చాయి. అత్యధికంగా కనగల్​ మండలం దర్వేశిపురం షాపుకు 154 అప్లికేషన్స్​ వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో చిలుకూరు మండలం బేతవోలు షాపుకు 59, అత్యల్పంగా తిరుమలగిరి షాపుకు 18 వచ్చాయి.

యాదాద్రిలో  2776 అప్లికేషన్

యాదాద్రి, వెలుగు:  వైన్స్​ షాపులకు గతం కంటే అప్లికేషన్లు తగ్గినా ఇన్​కం మాత్రం పెరిగింది. 18 నాటికి 2647 అప్లికేషన్లు వచ్చాయి. అయితే తక్కువగా వచ్చాయన్న ఉద్దేశంతో ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​ ఈ నెల 23 వరకూ గడువు పొడిగించడంతో 129 అప్లికేషన్లు పెరిగి 2776కు చేరింది.