రియల్లీ బ్యాడ్ న్యూస్.. 5 రోజులు వైన్స్ బంద్

రియల్లీ బ్యాడ్ న్యూస్.. 5 రోజులు వైన్స్ బంద్

నిజమండీ.. మందు బాబులకు ఇది బ్యాడ్ న్యూసే. కానీ తెలంగాణ మందుబాబులకు కాదు. దేశ రాజధాని ఢిల్లీలోని డ్రింకర్స్ కి. కృష్ణాష్టమీ, జీ 20 మీటింగ్ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. 

సెప్టెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు వైన్ షాపులు బంద్ ఉంటాయని ఆప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9, 10 తేదీల్లో జీ 20 సమ్మిట్ ఢిల్లీలో జరగనుంది. దీంతో కేంద్రం 8 నుంచి 10 వరకు పబ్లిక్ హాలీడే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  

ఆ రోజుల్లో మార్కెట్లు, స్కూళ్లు, బ్యాంకులు, అన్ని రకాల షాపులు మూతపడనున్నాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 6,7 తేదీల్లో మద్యం దుకాణాలు క్లోజ్ చేయాలని షాపు యజమానులను ఆదేశించింది. 

వరుస సెలవులు ఉండటంతో దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. క్యూ లైన్లలో వేచి చూస్తూ మరీ మందు బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మద్యం అమ్మకాలు గరిష్ఠానికి చేరాయి.