ఏపీలో మద్యం ప్రియులకు భారీ షాక్ తగిలింది.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వైన్ షాపులు మూతపడ్డాయి .నిన్నటితో ( సెప్టెంబర్ 30, 2024 ) వైన్ షాపు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తవ్వటంతో చాలా చోట్ల వైన్ షాపులు మూతపడ్డాయి. రాష్ట్రంలోని విజయనగరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు తదితర జిల్లాలో వైన్ షాపులు మూసేసారు. వైన్ షాపులు మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయన్నది క్లారిటీ లేదు.
అయితే, మరో 10రోజులు వైన్ షాపులు తెరవాలని ప్రభుత్వం కోరినా కూడా అంగీకరించలేదు ఉద్యోగులు. ప్రభుత్వం ప్రైవేట్ వైన్ షాపులు తెరుస్తున్న క్రమంలో తమ ఉద్యోగాలు ఉండవని.. ఈరోజు ( అక్టోబర్ 1, 2024 ) నుండి విధులకు దూరంగా ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు.
Also Read :- ఉన్న సమాచారాన్ని మాత్రమే సీఎం చెప్పారు
ఒక్కసారిగా వైన్ షాపులు మూతపడటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మందుబాబులు. పక్క ఊళ్లలో కూడా వైన్ షాపులు మూసి ఉండటంతో నిరాశకు గురవుతున్నారు మద్యం ప్రియులు. వైన్ షాపులు తెరుచుకోకపోవడంతో చేసేదేమిలేక బార్లకు వెళ్లి అధిక ధరలకు మద్యం కొంటున్నారు మద్యం ప్రియులు. రాష్ట్రవ్యాప్తంగా 3,240 వైన్ షాపులు మూతపడ్డట్టు తెలుస్తోంది. కాగా.. ఏపీలో అక్టోబర్ 12 నుండి కొత్త మద్యం పాలసీ ప్రకారం వైన్ షాపులు, బార్లు తెరుచుకోనున్నాయి..