గెలుపు ఓటములు సర్వ సాధారణం.. కసితో ముందుకెళ్లాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

గెలుపు ఓటములు సర్వ సాధారణం..  కసితో ముందుకెళ్లాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • కాకా అంబేద్కర్‌‌ ‌‌ లా కాలేజీ మూట్‌‌ ‌‌ కోర్టు ముగింపు ప్రోగ్రాంకు హాజరు

ముషీరాబాద్, వెలుగు: చదువు పోటీల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని, ఎవరు నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూ ఉండాలని కాకా డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ ఇన్‌‌ ‌‌స్టిట్యూట్ చైర్మన్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ అంబేద్క ర్ లా కాలేజీలో రెండ్రోజుల పాటు మూట్ కోర్టు పోటీలు జరిగాయి. శనివారం ఈ పోటీల ముగిం పు కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి, హైకోర్టు జడ్జి జస్టిస్ సుధా, ప్రొఫెసర్ జీబీ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపల్ రాధిక యాదవ్, ప్రొఫెసర్ మహేందర్ కుమార్, ప్రొఫెసర్ కేవీఎస్ శర్మ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లా కాలేజీ విద్యార్థులు ఏ విషయంలోనూ నిరాశ పడకుండా ప్రాక్టీస్ చేస్తూ విజయం సాధించాలని సూచించారు. అంబేద్కర్ లా కాలేజీ అనుక్షణం విద్యార్థులను ప్రోత్సహిస్తూ అన్ని అంశాల్లో ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌‌ ‌‌స్టిట్యూట్ జాయింట్ సెక్రటరీ రమణ, డైరెక్టర్ రిషికాంత్, లా కాలేజీ ప్రిన్సిపాల్ సృజన, లెక్చరర్లు, స్టూడెంట్లు  పాల్గొన్నారు.