ఈసారి ప్యాన్ వరల్డ్

ఈసారి ప్యాన్ వరల్డ్

బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌‌ ఇమేజ్‌‌ ప్యాన్‌‌ ఇండియా స్థాయిని కూడా దాటేసింది. ఆ ఇమేజ్​ని, తన క్రేజ్​ని మరింత పెంచే సినిమాలే చేస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం ఆదిపురుష్‌‌, సాలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘రాధేశ్యామ్‌‌’ ఎప్పుడొస్తుందా అనే ఎదురుచూపులతో పాటు ఈ మూవీస్‌‌ అన్నీ ఏ స్థాయిలో విడుదలవుతాయా అనే అంచనాలు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ‘ఆదిపురుష్‌‌’ విషయంలో ఎక్స్‌‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ప్రభాస్‌‌ రాముడిగా నటిస్తుండడం, భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌‌, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతుండటమే అందుకు కారణం. ఓం రౌత్‌‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సీతగా కృతీసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. నాలుగొందల కోట్ల భారీ బడ్జెట్‌‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు రీసెంట్​గా రివీల్ అయ్యింది. ఇప్పటికే షూటింగ్‌‌ కంప్లీటయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇక రిలీజ్‌‌ ప్లాన్స్‌‌ ఊహించని రేంజ్‌‌లో ఉన్నాయి. పదిహేను భారతీయ భాష ల్లోనే కాక ఇంగ్లిష్‌‌తో పాటు పలు విదేశీ భాషల్లోనూ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. హాలీవుడ్‌‌ సినిమాల తరహాలో ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేల స్క్రీన్స్‌‌లో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం డీస్నీ స్టూడియోస్‌‌తో చర్చలు కూడా నడుస్తున్నాయట.  చైనా, జపాన్, తైవాన్, మలేషియా లాంటి దేశాల్లో ప్రభాస్‌‌కి క్రేజ్ ఉండటంతో పాటు రామాయణం అనేది యూనివర్సల్‌‌ కాన్సెప్ట్ కాబట్టి ఈ స్థాయిలో అరేంజ్‌‌మెంట్స్ జరుగుతున్నాయి. అందుకే ఇది ప్యాన్‌‌ ఇండియా మూవీ కాదు.. ప్యాన్ వరల్డ్ మూవీ అంటున్నారు అభిమానులు.