చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా కేసులు

చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా కేసులు

కరోనా పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో కొవిడ్ మరోసారి విజృంభిస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం అందర్నీ కలవరానికి గురి చేస్తోంది. గురువారం ఒక్కరోజే 31,454 కరోనా కేసులు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ బ్యూరో వెల్లడించింది. సామూహిక కరోనా పరీక్షలు, ప్రయాణ పరిమితులు, లాక్‌డౌన్లతో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే చైనా ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కఠినమైన నిర్బంధం విధిస్తున్నారు. అయినా కూడా కరోనా కేసులు మళ్లీ ఎక్కువ అవుతుండడంతో అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. షాంఘై నగరంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా 29,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం.

చైనాలో అమలు చేస్తున్న కరోనా కఠిన నిబంధనలు టెన్షన్లకు దారి తీస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్​ తయారీ కంపెనీ అయిన ఫాక్స్​కాన్​లో వేలాది మంది కార్మికులు క్వారంటైన్​లో ఉన్నారు. వీరికి ఎలాంటి సౌకర్యాలు లేవు. దీనికితోడు అక్కడే పని చేస్తున్న వారికి కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వారంతా ప్రభుత్వంతో పాటు కంపెనీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.