ఈ నిక్కరు పదిహేను వేలు

ఈ నిక్కరు పదిహేను వేలు

టెక్నాలజీ వాడకం పెరిగాక ఆన్​లైన్​ షాపింగ్‌‌‌‌ చేసేవాళ్లు ఎక్కువైపోయారు. పెన్సిల్ నుంచి బట్టల వరకు ప్రతీది ఆన్​లైన్​లో కొనడానికి అలవాటు పడ్డారు. అర్షద్​ వసీబ్​ అనే ట్విట్టర్ యూజర్ కూడా ఆన్​లైన్ షాపింగ్ చేద్దామనుకున్నాడు. రోజూ రాత్రిపూట వేసుకునే నిక్కరు కోసం వెతికాడు. తను వెతుకుతుండగా బ్లూ, గ్రీన్ చారలతో ఉన్న ఒక ఫ్యాషన్ బ్రాండ్​ షార్ట్ కనిపించింది. దాని కింద ధర కేవలం15, 450 రూపాయలు అని ఉండడం చూసి అవాక్కయ్యాడు. ‘నిక్కరు ఇంత రేటా? అసలు దీనికి ఇంత రేటెందుకు పెట్టారు!’ అంటూ దాన్ని ఫొటో తీసి ట్విట్టర్​లో షేర్ చేశాడు​. అది చూసిన నెటిజన్లు ‘అది 90ల కాలం నాటిది అయ్యుండొచ్చు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. అందుకే అది అంత రేటు’ అంటూ రెస్పాండ్ అవుతున్నారు. మొన్నామధ్య అమెజాన్​లో కూడా ఇలాంటి ధరే ఒకటి ఆశ్చర్యపరిచింది. ఒక పింక్ కలర్ ప్లాస్టిక్ బకెట్​ ధర 35,000 రూపాయలు ఉంటే దాన్ని 28శాతం డిస్కౌంట్​తో 25, 999 రూపాయలకు అందుబాటులో ఉంచారు. ఆ వార్త సోషల్ మీడియాలో వీర విహారం చేసింది.