అసెంబ్లీకి ఒక సిస్టం లేకుండా పోయింది

అసెంబ్లీకి ఒక సిస్టం లేకుండా పోయింది

హైదరాబాద్ : అసెంబ్లీకి ఒక సిస్టం లేకుండా పోయిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాత్రి కల వస్తే..పొద్దున సభ పెడుతున్నారన్నారు. సభ్యులకు ఎజెండా తెలియదు.. బీఏసీ సమావేశం లేదు..విచిత్ర పాలన తెలంగాణలో ఉందన్నారు. చిన్న పిల్లలు స్కూల్ కు పోయినట్లు ఉందని..క్లాస్ లో పిల్లలు పాఠాలు విన్నట్లు మేము వినాల్సి వస్తుందన్నారు. నియంత్రిత పంటల పేరుతో రైతులను బంధించారని–అకాల వర్షాల వల్ల తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. రూ.72వేల కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు చేశారంటే ప్రజలు నమ్ముతారా? అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తున్నదా?ఇంతటి హడావిడిగా మున్సిపల్ చట్టం తేవడానికి పనేం ఉందన్నారు. టీఆర్ఎస్  ఎమ్మెల్యేలు, మంత్రులు వేలిముద్రలు అయ్యారన్నారు.

కూకట్ పల్లి అభివృద్ధి అని ఎమ్మెల్యే మాట్లాడుతుండని..-మేము వస్తాం ఎమ్మెల్యే వస్తాడా? అభివృద్ధి చూపిస్తాడా? అని ప్రశ్నించారు. కూకట్ పల్లి, హైదరాబాద్ లో అభివృద్ధి పనులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో స్టార్ట్ చేసినవేనన్నారు. ధరణిలో ఆస్తులను నమోదుకు ప్రజలు సిద్ధంగా లేరని…ధరణి పేరుతో ప్రజల ఆస్తుల పేరుతో అప్పులు తెస్తారా అని అనుమానం ఉందన్నారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆరెస్ ను ఒడిస్తేనే కేసీఆర్ ప్రజల దగ్గరకు వస్తారు.. లేదంటే ప్రజల జీవితాల్లో మార్పు రాదన్నారు జగ్గారెడ్డి.