నో కోచింగ్.. ఓన్ ప్రిపరేషన్

నో కోచింగ్.. ఓన్ ప్రిపరేషన్

నాకు 2009లో పెళ్లయిం ది. ఆ తర్వాతసంవత్సరానికి బాబు పుట్టాడు. అప్పటికీ ఇంట్లో ఖాళీగా ఉంటున్న నాకు బీఎడ్ చేయమని మా ఆయన మహేందర్‌ రెడ్డి సలహా ఇచ్చారు.అలా 2014లో బీఎడ్ పూర్తి చేశా, 2016లో ఎమ్మెస్సీ జువాలజీ చదివా. అప్పటినుంచి చదువుకోవాలి.. సర్కారు నౌకరి కొట్టా లన్న ఆశ పెరిగింది. ఇదేమాట మా ఆయనకు చెబితే సరేనన్నారు. అలానా ప్రిపరేషన్ 2016లో మొదలైంది. కోచింగ్ వెళ్లాలంటే హన్మకొండకు వెళ్లాలి. అప్పటికే మాకు రెండోసారి బాబు పుట్టాడు. ఇంట్లోనే కూర్చుని ప్రిపేరవుదామని ఫిక్సయ్యా.

రోజుకు 5 గంటలే..

2017లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చిం ది. వాటికోసం ప్రిపేరవడం మొదలుపెట్టా . 7వ తరగతి నుంచి ఉన్న తెలుగుఅకాడమీ బుక్స్ ముందేసుకున్నా. కేవలం బేసిక్స్ నేర్చు కోవడంపైనే దృష్టి పెట్టిన. కోచింగ్ సెంటర్లలో ఒకదాంట్లో ఒకలా చెబితే అదే టా పిక్ మరొక ఇనిస్టిట్యూట్‌ లో మరోలా చెబుతారు. ఈ కన్ఫ్యూజన్ కన్నా మనమే అర్థం చేసుకుని చదవడం బెటర్ అనిపించి ఓన్‌‌గా ప్రిపేరైన. పొద్దున 2గంటలు,సాయంత్రం 3గంటలు మొత్తంగా 5గంటలుమాత్రమే చదివిన. అప్పటికీ మా ఆయన పిల్లలను బయటకి తీసుకెళ్తే నేను పుస్తకాలు పట్టుకునేదాన్ని.చదివిన ప్రతిసారి ఇంట్రస్ట్‌‌గా చదివా. ఒకసారి చదివానంటే గుర్తుండిపోతుంది. ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకుంటే సరిపోయేది. నాలుగు జాబ్‌ లు అచీవ్ చేశానంటే దానికి కారణం నా మె మొరీనే అనిపిస్తుంది.

డీఎల్, గ్రూప్2 టార్ గెట్

నాలా ప్రిపేరవుతున్న అమ్మాయిలకు నా సలహాఒక్కటే ఎప్పుడూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. పెళ్లయితే లైఫ్ అయిపోయిందని కూర్చో వద్దు. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు ఎంత గుర్తు పెట్టుకున్నామన్నదే చాలా ముఖ్యం .ఫ్యూచర్‌ లో డీఎల్, గ్రూప్–2 జాబ్ కొట్టా లని టార్గెట్  పెట్టుకున్న. ఒక్క జాబ్ వస్తే చా లు అనుకున్న కానీ ఈ అచీవ్‌‌మెంట్స్ చూస్తుంటే ఇంతకంటే పెద్ద జాబ్‌ లు కొడుతానన్న నమ్మకం కలిగింది.అందుకే ‘గో ఫర్ బెస్ట్ వన్’ అని ఫిక్సయ్యా. మాది వ్యవసాయ కుటుంబం. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మాసాగర్‍ మండలం మల్లి కుదుర్ల మా ఊరు.నాన్న పొలం పనులు, అమ్మ ఇంటి పనులు చూసుకుంటుంది.మా ఆయన నెక్కొండ వికాస్‍ కాలేజ్ లో మ్యాథ్స్ చెబుతారు. ఇద్దరు తమ్ము ళ్లు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు.