చోరీకేసు పెట్టి ఎస్సై వేధింపులు..అవమానం భరించలేక మహిళ ఆత్మహత్య

చోరీకేసు పెట్టి ఎస్సై వేధింపులు..అవమానం భరించలేక మహిళ ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో ఎస్సై వేధింపులకు ఓ నిండి ప్రాణం బలైంది. చోరీకేసు పెట్టి వేధించడంతో  అవమానం భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అక్రమ కేసు బనాయించి ఎస్సై వేధించడం వల్లే ఆమె బలవనర్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 

తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన సోమనర్సమ్మ అనే మహిళపై 2.5 తులాల బంగారం దొంగతనం చేసిందని రెండు రోజులు క్రితం కేసు నమోదు చేశారు. చోరీ బనాయించడంతో అవమానంగా భావించిన సోమనర్సమ్మ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సోమనర్సమ్మ మృతికి ఎస్సై క్రాంతికుమార్​ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

గతంలో  ఎస్ ఐ క్రాంతికుమార్​ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నేరేడుగొమ్ము మండలంలో మేకలు అమ్ముకున్నారనే కేసులో క్రాంతికుమార్​ సస్సెండ్​ అయ్యారు. మర్రిగూడలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని తమకు న్యాయం చేయాలని సోమనర్సమ్మ కుటుంబ సభ్యులు కోరారు.