చాపల కూర వండుకుని తెమ్మన్నడు: ఎస్సైపై మహిళ ఫిర్యాదు 

చాపల కూర వండుకుని తెమ్మన్నడు: ఎస్సైపై మహిళ ఫిర్యాదు 
  • మహిళను వేధించిన శాలిగౌరారం  ఎస్సై
  • నల్గగొండ ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు  

హైదరాబాద్​: తన కోసం చాపల కూర, చికెన్ వండుకుని తీసుకు రావాలంటూ తనను ఓ ఎస్సై ఇబ్బంది పెట్టాడని నల్లగొండ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి తను వెళ్లనట్లు తెలిపింది. అయితే తనను ఎస్ఐ వేధింపులకు గురిచేశాడని సదరు మహిళ ఎస్పీకి తెలిపింది. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. తన అవసరాలు తీర్చాలని, చాపల కూర, చికెన్ వండుకుని రావాలంటూ ఇబ్బంది పెట్టాడని  శాలిగౌరారం ఎస్సైపై  ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు పై స్పందించిన ఎస్పీ శరత్ చంద్ర వవార్ విచారణ చేపడతామని ఆ మహిళకు హామీ ఇచ్చారు.