ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు చేసిన మహిళ

ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు చేసిన మహిళ

చాలా మంది నాన్ వెజ్ ప్రియులకు చెప్పగానే నోరూరే వంటకం చేపల పులుసు. సరైన మోతాదులో ఉప్పు, కారు, చింతపండు రసం కలిపి పులుసు పెడితే ఆ రుచే వేరేగా ఉంటుంది.  అయితే మరికొంది ఇవే చేపల్తో సూప్ లు, కూరలు, సాస్ లకు బేస్ గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మామూలుగా ఈ ఫేమస్ చేపల పులుసును కుండల్లో లేదా వెడెల్పాటి పాత్రలో చేయడం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే కూరను కలిపేటప్పుడు చేప ముక్కలు విడిపోకుండా, ముక్కలు కాకుండా ఉండేందుకు, సరిగ్గా ఉడికేందుకు. కానీ ఓ మహిళ మాత్రం ఈ చేపలను ఉడికించేందుకు ప్లాస్టి్క్ బ్లాగ్ ను ఉపయోగిస్తోంది. వినడానికి వింతగా, ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ది ఫైజెన్ ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వృద్ధ మహిళ నిప్పుకు కొంత ఎత్తులో నీటితో ఉన్న ప్లాస్టిక్ బ్యాగును పెట్టింది. అందులో చేపలు, మిరపకాయలు, దోసకాయలతో పాటు ఉప్పు కూడా వేసి ఉడికిస్తోంది. మరో ముఖ్య విషయమేమిటంటే వేడి ప్రభావానికి ప్లాస్టిక్ బ్యాగ్ కాలకుండా అలాగే ఉంది. ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే ఈ వీడియోకు ఇప్పటి వరకు 1.5 మిలియన్ల వ్యూస్, 10.9వేల లైక్‌లు, వందలాది కామెంట్లు వచ్చాయి.  చేపల పులుసు వండే ఈ ప్రత్యేకమైన స్టైల్ నెటిజన్లు చాలా ప్రశ్నలు అడిగేలా చేసింది. ప్లాస్టిక్‌లో వండడం ఆరోగ్యకరం కాదని కొందరు ఎత్తి చూపగా, మరికొందరు నిప్పుతో ప్లాస్టిక్ కరిగిపోతుంది కదా.. ఇది సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఇంకొకరేమో "ఎవరైనా దయచేసి ఆ బ్యాగ్ ఎందుకు కరిగిపోలేదో నాకు చెప్పండి. నాకు అర్థం కాలేదు."  అనే కామెంట్ చేశారు.