విమానంలో పుట్టిన శిశువు.. లైఫ్ లాంగ్ ఫ్రీ జర్నీ ఆఫర్!

విమానంలో పుట్టిన శిశువు.. లైఫ్ లాంగ్ ఫ్రీ జర్నీ ఆఫర్!

బెంగళూరు: ఢిల్లీ నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో ఫ్లయిట్‌‌లో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి విమానంలోనే ప్రసవమైంది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో ఇండిగో సిబ్బంది సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సదరు మహిళకు ప్రసవం కావడానికి విమాన సిబ్బంది సాయం చేశారు. ‘ఢిల్లీ నుంచి బెంగళూరుకు వస్తున్న 6ఈ 122 ఫ్లయిట్‌‌లో ఓ బాబు పుట్టాడు. దీనికి సంబంధించిన తదుపరి వివరాలు మా దగ్గర లేవు’ అని ఇండిగో పేర్కొంది. అందిన సమాచారం ప్రకారం.. సదరు మగ శిశువుకు జీవితాంతం తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణం చేసే ఆఫర్‌‌ను ఇండిగో సంస్థ ఇచ్చిందని సమాచారం. విమానంలో పుట్టిన సదరు శిశువును ఎత్తుకొని ఇండిగో సిబ్బంది దిగిన ఫొటోలు, వీడియోలు నెట్‌‌లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే మహిళ తన శిశువుతో విమానం దిగగానే ఇండిగో సిబ్బంది చేసుకున్న సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.