కళ్లముందే కన్నతల్లి దుర్మరణం

కళ్లముందే కన్నతల్లి దుర్మరణం

చెన్నై: రోడ్డుపై తన కూతురితో నడిచివెళుతున్న ఓ మహిళను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కూతురి రోదనలు మిన్నంటాయి. తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళం లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సి.సి.కెమెరాలలో ఈ ఘటన దృశ్యాలు రికార్డు కావడంతో బయటకు వచ్చాయి.

ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న అగస్ట రాణి అనే మహిళ తన కుమార్తెతో కలిసి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళుతోంది. బస్టాండ్ సమీపంలోని ఏ.వి.ఎస్ జ్యువలెరీ దగ్గర వస్తుండగా, వారి వెనక నుండి వేగంగా వచ్చిన లారీ డీ కొట్టి, ఆమెపై నుండి దూసుకుపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కబుర్లు చెబుతూ వస్తున్న కన్న తల్లి తన కళ్ల ముందే  చనిపోవడంతో బాలిక కన్నీరు మున్నీరుగా విలపించింది.