అనుమానాస్పదంగా మహిళ మృతి ..కల్తీ కల్లే కారణమని బంధువుల ఆందోళన

అనుమానాస్పదంగా మహిళ మృతి ..కల్తీ కల్లే కారణమని బంధువుల ఆందోళన

కొల్లాపూర్, వెలుగు : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ చనిపోయింది. మహిళ మృతికి కల్తీ కల్లు తాగడమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లా కొల్లాపూర్‌‌‌‌ మండలంలో ఆదివారం జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే... మండలంలోని యన్మన్‌‌‌‌బెట్ల గ్రామానికి చెందిన మరాఠీ మంగమ్మ (45) ఆదివారం తన ఇంట్లో చనిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు కల్తీ కల్లు తాగడం వల్లే మంగమ్మ చనిపోయిందని ఆరోపిస్తూ స్థానిక కల్లు దుకాణం ఎదుట డెడ్‌‌‌‌బాడీతో ఆందోళనకు దిగారు. కల్తీ కల్లు అమ్ముతున్న నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌‌‌‌ ఆఫీసర్లు కల్లు దుకాణం వద్దకు చేరుకొని శాంపిల్స్‌‌‌‌ సేకరించి ల్యాబ్‌‌‌‌కు పంపించారు. అనంతరం దుకాణాన్ని సీజ్‌‌‌‌ చేశారు. మంగమ్మ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.