చపాతీల్లో జడ్జీ కుటుంబానికి విషం పెట్టిన మహిళ

చపాతీల్లో జడ్జీ కుటుంబానికి విషం పెట్టిన మహిళ

తనకు దూరమయ్యాడన్న కోపంతో జడ్జీ కుటుంబానికి విషం పెట్టింది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో చోటుచేసుకుంది. బేతుల్ జిల్లా అదనపు మరియు సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న మహేంద్ర త్రిపాఠి బేతుల్ లో ఒంటరిగా ఉంటున్నాడు. అతని కుటుంబం మాత్రం వేరే ఊర్లో ఉండేది. గతంలో మహేంద్ర చింద్వారాలో పనిచేసినప్పటి నుంచి ఓ ఎన్జీఓను నడిపిస్తున్న సంధ్యారాణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఒక్కడే ఉండటంతో వారిద్దరికి సాన్నిహిత్యం పెరిగింది. అయితే గత నాలుగు నెలల కింద మహేంద్ర కుటుంబం బేతుల్ కు వచ్చి ఆయనతో పాటు ఉంటున్నారు. దాంతో సంధ్యారాణికి మహేంద్రను కలిసే అవకాశం రాలేదు. దాంతో మహేంద్ర తనకు దూరమయ్యాడన్న కోపంతో.. అతని కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకుంది.

అవకాశం కోసం చూసిన సంధ్యారాణి.. మహేంద్రతో ఫోన్ లో మాట్లాడింది. ఇంట్లో అందరూ బాగుండాలంటే ఒక పూజ చేయాలని చెప్పింది. అందుకోసం గోధుమపిండి కావాలని.. ఆ పిండితో చపాతీలు చేసుకొని తినాలని తెలిపింది. అది నమ్మిన మహేంద్ర.. జూలై 20న సంధ్యారాణి ఇచ్చిన పిండిని ఇంటికి తీసుకొచ్చాడు. దానితో చపాతీలు చేయించుకొని.. మహేంద్ర, అతని ఇద్దరు కుమారులు తిన్నారు. కానీ, మహేంద్ర భార్య మాత్రం అన్నం తిన్నది. రెండు రోజుల తర్వాత జూలై 23న మహేంద్ర, అతని ఇద్దరు కుమారులు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జూలై 25న నాగ్‌పూర్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అక్కడికి చేరుకున్న రోజే జడ్జీ యొక్క 33 ఏళ్ల కుమారుడు చనిపోయాడు. మరుసటి రోజు జడ్జీ కూడా ప్రాణాలొదిలాడు. జడ్జీ చిన్న కొడుకు ఆశిష్ మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా సంధ్యారాణిని కూడా విచారించగా అసలు విషయం బయటపడింది. దాంతో ఆమెతో పాటు ఆమె డ్రైవర్ సంజూను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారణ చేసిన తర్వాత ఆమెకు సహకరించిన మరో ముగ్గురితో పాటు.. క్షుద్రపూజ చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సిమల ప్రసాద్ తెలిపారు.

For More News..

రైతువేదిక భవనం కోసం బలవంతంగా భూసేకరణ.. రైతు ఆత్మహత్య

ప్రభుత్వానికి అంబులెన్సులను అందజేసిన కేటీఆర్

అడ్డుకుంటున్నాడని లారీతో తొక్కించిన ఇసుక మాఫియా