
కొంతమంది యువకులు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొనేందుకు ఎంతకైనా తెగిస్తారు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా.. బలవంతం చేస్తారు దుర్మార్గులు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనే రాజప్థాన్ లో జరిగింది. బలవంతంగా ఎత్తుకొచ్చిన వీడియో రాజకీయ నేతలకు దొరకడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటన జైసల్మేర్‌లోని సంఖ్లా గ్రామంలో జరిగింది.
ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలపై విరుచుకు పడటానికి ఏ అంశం దొరుకుతుందా అని కాచుక్కూచ్చుంటారు. అవకాశం వచ్చిన అంశాన్ని రచ్చ చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతుంటారు. ఇప్పుడు అలాగే రాజస్థాన్ ఆప్ నేత వినయ్ మిశ్రా ఓ వీడియోతో సీఎం అశోక్ గెహ్లాట్ ను ప్రశ్నించారు.
వీడియోలో ఓ బాలికను రెండు చేతులతో తీసుకొస్తాడు. ఆ బాలిక సాయం చేయండని ఏడుస్తున్నా అక్కడున్న వారెవరు పట్టించుకోలేదు. అగ్ని హోత్రం ( మంట) చుట్టూ ఎత్తుకొని తిప్పుతున్నట్లు వీడియోలో ఉంది. అయితే ఈ బాలికను 15-20 మందితో కూడి ఓ గ్యాంగ్ జూన్ 1న కిడ్నాప్ చేసిందని ఆప్ నేత వినయ్ మిశ్రా తెలిపారు. జైసల్మేర్‌లోని సంఖ్లా గ్రామం నుంచి బాలికను కిడ్నాప్ చేశారు. ఒక వ్యక్తి బలవంతంగా బాలికను ఎత్తుకెళ్లి బలవంతంగా వివాహం చేసుకున్నాడని ట్వీట్ లో తెలిపాడు.
ఆప్ నేత నరేష్ బల్యాన్ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆప్ రాజస్థాన్ నాయకుడు వినయ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. . ఇప్పటి వరకు నిందితుల్లో ఎవరినీ అరెస్టు చేయలేదని ఆప్ నేత తన ట్వీట్‌లో తెలిపారు.
ఆప్ నేత వినయ్ మిశ్రా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కూడా ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ఎదురు చూస్తున్నారా’ అని మిశ్రా సీఎంను ప్రశ్నించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాంతి మరియు అహింసా విభాగం కార్యాలయాలను ప్రారంభించినప్పటికీ ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దాని ప్రారంభ సమయంలో, "దేశంలో శాంతి మరియు అహింసా సెల్‌ను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం రాజస్థాన్" అని అన్నారు.
https://twitter.com/AAPNareshBalyan/status/1666020106596683776