
హైదరాబాద్ : యువతి అదృశ్యమైన సంఘటన కుత్బుల్లాపూర్ జరిగింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. కుత్బుల్లాపూర్ రాఘవేంద్ర కాలనీకి చెందిన కుమార్ యాదవ్ కూతురు నంది (21) ఈ నెల 1న ఇంట్లో నుంచి సాయంత్రం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులు వద్ద వెతికినా ఆచూకీ కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు శనివారం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.