వైరల్ పిక్: తాలిబన్ గన్‎కు ఎదురు నిలిచిన మహిళ

V6 Velugu Posted on Sep 08, 2021

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‎‎లో మహిళలు తమ హక్కుల కోసం రోడ్లేక్కుతున్నారు. తమ వ్యక్తిగత హక్కులు మరియు స్వేచ్ఛను కాపాడుకోవడానికి తాలిబన్లకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. అందులో భాగంగా తాలిబాన్లకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. పాక్ చేతిలో కీలుబొమ్మ ఉండే తాలిబన్ ప్రభుత్వం తమకొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. కాబుల్‎లో తాలిబన్లకు వ్యతిరేకంగా ర్యాలీ తీసున్న మహిళలను చెదరగొట్టడానికి తాలిబన్లు మంగళవారం గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా జనం బెదరకుండా నినాదాలు కొనసాగించారు. ఒక తాలిబన్ ముందుకొస్తున్న మహిళకు తుపాకీ ఎక్కుపెట్టగా.. ఏ మాత్రం బెదరకుండా ముందుకు రావడం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంగళవారం పాకిస్థాన్ రాయబార కార్యాలయం దగ్గర పాకిస్తాన్‎కు వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేస్తుండగా ఓ జర్నలిస్ట్ ఈ ఫొటో తీశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tagged Pakistan, Afghanistan, protesters, Kabul, Taliban, women protesters

Latest Videos

Subscribe Now

More News