యజమాని ఇంటికే కన్నం వేసిన మహిళ.. 35 తులాల గోల్డ్, 4 లక్షలు చోరీ

V6 Velugu Posted on Oct 04, 2021

ఎంతకాలం బట్టల షాపులో పనిచేస్తాము అనుకుందోమో ఏమో.. ఓనర్ ఇంట్లోనే చోరీ చేసింది ఓ మహిళ. 35 తులాల బంగారం, 4 లక్షలు దొంగిలించింది. క్లాత్ షాప్ ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగతనానికి పాల్పడిన మహిళను అరెస్ట్ చేశారు.

సూర్యాపేట జిల్లా కోదాడలో రెడీమేడ్ బట్టల షాపు నడిపిస్తున్నాడు చక్రపాణి.  రెండు నెలల క్రితం పనికి కుదిరింది హైదరాబాద్ కు  చెందిన గౌసియా బేగం.  యాజమాని లేని  సమయంలో నగలు, డబ్బులు చోరీ చేసింది. వాటిని తాను కిరాయికి ఉండే ఇంటి చెట్ల పొదల్లో దాచిపెట్టింది.  10 రోజుల తర్వాత లాకర్ చూసిన యజమాని బంగారం డబ్బులు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బేగంను  అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

see more news

మాస్క్‌ పెట్టుకోలేదని.. ఫీల్డ్ అసిస్టెంట్స్ అరెస్ట్

 

ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులకు కేటీఆర్ ఫోన్

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం 30 రోజుల్లో ఇవ్వాలి

Tagged gold, Kodada, Woman robs, clothes shop owner, Suryapeta

Latest Videos

Subscribe Now

More News