పోలీసుపై ఉమ్మేసిన భారత సంతతి మహిళ

పోలీసుపై ఉమ్మేసిన భారత సంతతి మహిళ

మాన్‌‌హట్టన్: ఒక ప్రభుత్వ అధికారిపై ఉమ్మి వేసినందుకు భారత సంతతికి చెందిన ఓ మహిళను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూఎస్‌‌లోని మాన్‌‌హట్టన్‌‌లో నిర్వహించిన యాంటీ-ట్రంప్ ర్యాలీలో ఈ ఘటన జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచానని, ఇక ఓటింగ్‌‌ను నిలిపివేయాలని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలకు నిరసిస్తూ మాన్‌‌హట్టన్‌‌లో కొందరు ఆందోళనలకు దిగారు. ఈ నిరసనల్లో పాల్గొన్న 24 ఏళ్ల దేవినా సింగ్ అనే మహిళ.. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన ఓ ఆఫీసర్‌‌పై ఉమ్మింది. అంతేగాక ఆ పోలీసును అసభ్యంగా తిడుతూ, ఫాసిస్ట్ అని కామెంట్ చేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌‌మెంట్ స్పష్టం చేసింది.