పెళ్లయి పదేళ్లు.. ఇద్దరు మగ పిల్లలు.. పుట్టింటికొచ్చి బతుకుతున్నా వదల్లేదు..!

పెళ్లయి పదేళ్లు.. ఇద్దరు మగ పిల్లలు.. పుట్టింటికొచ్చి బతుకుతున్నా వదల్లేదు..!

మంచిర్యాల, వెలుగు: అత్తింటి వేధింపులతో మంచిర్యాల పట్టణంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్ఐసీ కాలనీకి చెందిన మిట్టపల్లి ప్రవీణ్కు అదే కాలనీకి చెందిన ప్రియాంక(28)తో 2014లో పెండ్లయ్యింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. కొంత కాలంగా ప్రియాంకను ప్రవీణ్ అనుమానిస్తూ వేధిస్తున్నాడు. ఈ నెల 9న భర్త, అత్తమామలు రమాదేవి, సత్యనారాయణ, మరిది ప్రదీప్ కలిసి ప్రియాంకను తిట్టి, కొట్టి ఇంట్లోంచి వెళ్లగొట్టడంతో పుట్టినింట్లోనే ఉంటోంది.

ఆ తర్వాత కూడా భర్త, అత్తమామలు ఫోన్ చేసి విడాకులు ఇస్తామంటూ వేధిస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ప్రియాంక సోమవారం ఉదయం 10.30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఆమె తల్లి అంకం ఓదమ్మ ఫిర్యాదు మేరకు ప్రవీణ్, రమాదేవి. సత్య నారాయణ, ప్రదీప్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.