ప్రియురాలితో భర్త.. చితకబాదిన భార్య

ప్రియురాలితో భర్త.. చితకబాదిన భార్య

వరంగల్ : ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడె గా పట్టుకుని చితకబాదింది ఓ మహిళ. ఈ సంఘటన మంగళవారం ఉదయం వరంగల్ లో జరిగింది. శివనగర్ కు చెందిన రవి.. 3 సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటూ వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. తన సంసారం నాశనం అవుతుందని..భర్తకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకుంది రవి భార్య.

దీంతో కొన్ని రోజులుగా రవి ఉంటున్న ఇంటిపై కన్నేసింది. మంగళవారం ఉదయం ప్రియురాలితో కలిసున్న రవిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. స్థానికుల సహకారంతో చితకబాదింది.  ఆమెతోపాటు తోటి మహిళలు కూడా రవికి, అతనితోపాటు ఆ మహిళను చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు.