పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనలో మంత్రి కేటీఆర్కు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై బీజేపీ నాయకురాలు నల్ల బెలూన్లు విసిరింది. గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో తన కారులో వచ్చిన సుజశ్రీ అనే బీజేపీ నాయకురాలు పరుగులు తీస్తూ కేటీఆర్ కాన్వాయ్పై బ్లాక్ బెలూన్లు విసిరింది.
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలానికి చెందిన జనగామ సుజశ్రీ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు. అయితే మంత్రి కేటీఆర్ రామగుండం పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లు విసిరారు. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
మరోవైపు పెద్దపల్లి జిల్లా సంజీవయ్య నగర్ లో కేటీఆర్ కాన్వాయ్ కు ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు ఎదురెళ్లారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అయితే కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం పట్ల విపక్ష పార్టీల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.