
- డ్రస్ మీద డ్రెస్సేసుకుని
విమానంలో వెళ్లే ప్రయాణికులు 6 కిలోల కన్నాఎక్కు వ బరువు తీసుకెళ్తే ఎయిర్ పోర్టు అధికారులు అనుమతించరు. ఎక్స్ ట్రా లగేజీకి అదనంగా చార్జీలు వసూలు చేస్తారు. విమానాల్లో వెళ్లేవారికి ఒక్కసారైనా ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. ఇంగ్లండ్ లో 30 ఏళ్ల నటాలీ విన్ ఎలాంటి చార్జ్ చెల్లించకుండా తనతోపాటు 4 కిలోల ఎక్స్ ట్రా లగేజీని తీసుకెళ్లింది అది ఎలా అని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నటాలీ విన్ తన ఫ్రెండ్ తో కలిసి మాంచెస్టర్ నుంచి స్పెయిన్ లోని ఫ్యూర్చ్ వెంచురా వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకెళ్లింది. ఆమె లగేజీని చెక్ చేస్తే రూ.9.4 కిలోల బరువుంది. కేవలం 6 కిలోల వరకు లగేజ్ మాత్రమే తీసుకెళ్లాలని ఆఫీసర్లు చెప్పారు. మిగతాది తీసుకెళ్లాటే రూ.5,800 చెల్లిం చాలన్నారు. ఎయిర్ లైన్స్ పాలసీతో నటాలీ అసహనానికి గురైంది. అయితే ఆమె రాజీ పడలేదు. ఫ్రెండ్స్ టీవీ షో లోని ఒక సీన్ గుర్తొచ్చింది. దాంట్లో జో, షాండ్లర్ ఇద్దరూ గొడవపడతారు. కోపంతో షాండ్లర్ డ్రెస్సులన్నింటినీజో ఒకేసారి వేసుకుంటా డు. ఈ ట్రిక్ ను నటాలీ వెంటనే వాడేసింది. ఎక్స్ ట్రా లగేజీ నుంచి డ్రెస్సులన్నింటినీ బయటకు తీసి వాటిని వెంటనే ఒంటిపై ఒకదానిపై ఒకటి వేసుకుంది. ఇలా ఆమె వేసుకున్న డ్రెస్సుల బరువు 4 కిలోలు. ఇక లగేజీ వెయిట్ తగ్గడంతో అధికారులు చేసేదేమీ లేక ఆమెను లోపలికి అనుమతించారు. ఈ ఘటనను ద సన్ పత్రిక పబ్లిష్ చేసింది. నటాలీ రెండు జతల షార్ట్ లు, ఏడు డ్రెస్సులు, రెండు జతల షూస్ ధరించినట్లు రిపోర్ట్ చేసింది. ఎయిర్ పోర్టు అధికారుల తీరుపై తనకు కోపం వచ్చిందని, అందుకే అలా చేశానని ద సన్ పత్రికకు నటాలీ తెలిపింది. ఆమె తెలివికి తోటి ప్రయాణికులు హ్యాట్సాఫ్ చెప్పారు.