ఇండియాపై అమెరికా  టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 13 శాతం దగ్గరనే.. యూఎస్ సుప్రీం కోర్ట్ తీర్పుతో 25 శాతం నుంచి డౌన్‌‌‌‌

ఇండియాపై అమెరికా  టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 13 శాతం దగ్గరనే.. యూఎస్ సుప్రీం కోర్ట్ తీర్పుతో 25 శాతం నుంచి డౌన్‌‌‌‌
  • ఇతర ఆసియా దేశాలపైనా తగ్గిన టారిఫ్‌లు
  • మనకు అడ్వాంటేజ్ లేనట్టే
  • స్టీల్‌‌‌‌, అల్యూమినియంపై 50 శాతం కొనసాగింపు
  • ఫెయిలైన ట్రంప్ టారిఫ్ పాలసీ  

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాపై వేసిన టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సుప్రీం కోర్టు కొట్టేయడంతో సీన్ మారిపోయింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై సగటున 12.8 శాతం నుంచి 
13.5 % టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు పడుతున్నది.

న్యూఢిల్లీ: అమెరికా, ఇండియా మధ్య టారిఫ్‌‌‌‌ల గందరగోళం కొనసాగుతోంది. ప్రెసిడెంట్ ట్రంప్  గతేడాది మొత్తం టారిఫ్‌‌‌‌లతో ఫారిన్ పాలసీ నడిపారు. సుంకాలు వేసి ఇండియాతో సహా చాలా దేశాలను బెదిరించారు. మనపై 50 శాతం వరకు టారిఫ్ వేసి  రష్యా ఆయిల్ కొనొద్దని, తమ నుంచి డిఫెన్స్ కొనుగోళ్లు పెంచాలని, ట్రేడ్ డీల్‌‌‌‌కు వెంటనే రావాలని ఒత్తిడి తెచ్చారు.  కానీ, అమెరికా సుప్రీం కోర్టు ఈ ఎమెర్జెన్సీ టారిఫ్‌‌‌‌లను కొట్టేయడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద ట్రంప్ విధించిన అదనపు టారిఫ్‌‌‌‌లను ఈ నెల  20న రద్దు చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో తన టారిఫ్ బెదిరింపులను కొనసాగించేందుకు ఇతర చట్టాల కింద సుంకాలను వేయడం మొదలుపెట్టారు ట్రంప్. గ్లోబల్‌‌‌‌గా ట్రేడ్ చట్టం 1974 లోని సెక్షన్‌‌‌‌ 122 కింద 15 శాతం టెంపరరీ టారిఫ్ వేశారు. ఇందులో 10 శాతం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ టారిఫ్ రేటుతో  ఇండియాపై సగటు టారిఫ్ రేటు 10 శాతం కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది. కానీ, బంగ్లాదేశ్‌‌‌‌, పాకిస్తాన్, చైనాపై వేసిన అదనపు టారిఫ్‌‌‌‌లు కూడా తొలగిపోయాయి.  దీంతో మనకు టారిఫ్‌లు తగ్గినా, ఎటువంటి అడ్వాంటేజ్ దక్కలేదు.

ఇండియాపై ఇలా..

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌‌‌‌ఎన్‌‌‌‌) కింద ఇండియాపై 2.8 శాతం నుంచి 3.5 శాతం వరకు సగటు టారిఫ్‌‌‌‌ను అమెరికా వేస్తోంది.   ఇది డబ్ల్యూటీఓ రూల్స్ ప్రకారం అన్ని డబ్ల్యూటీఓ మెంబర్ దేశాలకు వర్తించే  బేస్ రేట్.  సెక్టార్ వారీగా మారుతుంది.  ఉదాహరణకు  టెక్స్‌‌‌‌టైల్స్, ఫుట్‌‌‌‌వేర్‌‌‌‌లో ఎక్కువ, ఫార్మా లాంటి కొన్ని రంగాల్లో తక్కువ లేదా జీరో టారిఫ్ ఉటుంది.  మరోవైపు సెక్షన్ 232 కింద స్టీల్‌‌‌‌, అల్యూమినియం, ఆటో పార్టులపై  50 శాతం వరకు టారిఫ్‌‌‌‌ను అమెరికా విధిస్తోంది.  ఇండియా నుంచి ఎగుమతి అయ్యే స్టీల్‌‌‌‌పై 50శాతం టారిఫ్ పడుతోంది. కిందటేడాది జూన్‌‌‌‌లో దీనిని డబుల్ చేశారు.   అల్యూమినియంపై టారిఫ్ 10 శాతం నుంచి  50 శాతానికి పెంచగా,  ఆటో పార్టులపై  25 శాతం టారిఫ్ పడుతోంది. ఈ టారిఫ్‌‌‌‌లను ఐఈఈపీఏ కింద ట్రంప్ వేయలేదు. అందువలన సుప్రీం కోర్ట్‌‌‌‌ తీర్పు వీటికి వర్తించదు.  ఈ రేట్లు కొనసాగుతున్నాయి. 

మారింది ఇలా..

తాత్కాలిక ట్రేడ్ డీల్‌‌‌‌లో భాగంగా  ఇండియాపై వేసే కొన్ని టారిఫ్‌‌‌‌లను ఈ నెల ప్రారంభంలో అమెరికా కొట్టేసింది. రష్యా ఆయిల్ కొంటున్నందుకు వేసిన 25 శాతం టారిఫ్‌‌‌‌ను తొలగించగా, మొత్తంగా వేసిన అదనపు టారిఫ్‌‌‌‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చింది.  యూఎస్  సుప్రీం కోర్ట్ ఐఈఈపీఏ  ఆధారంగా వేసిన రెసిప్రోకల్ టారిఫ్స్‌‌‌‌ను కొట్టేయడంతో ఈ 25 శాతం టారిఫ్ రేటు పూర్తిగా రద్దు అయ్యింది. దీంతో ఇండియాపై కేవలం ఎంఎఫ్‌‌‌‌ఎన్ కింద వేసే 2.8 శాతం–3.5 శాతం టారిఫ్ మాత్రమే పడింది.    ట్రంప్  సెక్షన్‌‌‌‌  122 కింద 15శాతం గ్లోబల్ టారిఫ్ వేశారు. ఇది 150 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత పొడిగించాలంటే కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. ఇందులో 10 శాతం అమల్లోకి రావడంతో ఇప్పుడు ఇండియాపై సగటున 12.8 శాతం నుంచి 13.5 శాతం  టారిఫ్‌‌‌‌ రేటు పడుతోంది.  15 శాతం అమలైతే 13–18 శాతం టారిఫ్ రేటు పడుతుంది. సెక్టార్ వారీగా మారుతుంది.  

ఇండియా వేస్తున్న టారిఫ్ చాలా ఎక్కువ

ఇండియా అమెరికా ప్రొడక్ట్స్‌‌‌‌పై వేస్తున్న సగటు ఎంఎఫ్‌‌‌‌ఎన్‌‌‌‌  టారిఫ్ 15శాతం–16శాతం  దగ్గర ఉంది.  గరిష్టంగా డెయిరీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్‌‌‌‌లపై 100–300 శాతం వరకు సుంకాలు వేస్తోంది.  ఆటోమొబైల్స్ 60–100 శాతం, ఆల్కహాల్‌‌‌‌పై 100–150 శాతం టారిఫ్ వేస్తోంది. ఇండియా, అమెరికా మధ్య 2024లో 212 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది.  అమెరికాతో మనకు వాణిజ్య మిగులు ఉంది.