11 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న యువతి స్విమ్మింగ్ పూల్ వీడియో

11 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న యువతి స్విమ్మింగ్ పూల్ వీడియో

ఈత కొట్టడమంటే చాలామందికి ఎంతో ఇష్టం. ఇక స్విమ్మింగ్ పూల్ లో అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ లో ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు. రకారకాలుగా దూకొచ్చు, ఎగరోచ్చు. అలా స్విమ్మింగ్ పూల్ లో విచిత్రంగా డైవ్ చేయబోయిన మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. జూలై 4న అమెరికన్ ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా కొంతమంది ఓ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ అందరూ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అందులో ఒక మహిళ, మరో పురుషుడు కలిసి పక్కనే ఉన్న రూఫ్ పైనుంచి స్విమ్మింగ్ పూల్ లోకి డైవ్ చేయాలని అనుకున్నారు. వెంటనే వారిద్దరూ రూఫ్ పైకి ఎక్కారు. ఇద్దరూ ఒకేసారి పరిగెత్తుకు వచ్చి దూకారు. పురుషుడు సరిగ్గా స్విమ్మింగ్ పూల్ లోకే దూకాడు. కానీ, మహిళ మాత్రం రూఫ్ ఎడ్జ్ కు రాగానే కొంచెం స్లో అయి తడబడింది. దాంతో ఆమె డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో పడకుండా.. రూఫ్ కింద ఉన్న రేకులపై పడి.. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లో పడింది. మహిళ పడిన తీరు చూస్తే.. దాదాపు మెడ విరగినట్లు కనిపిస్తుంది. మహిళ పడగానే అక్కడ ఉన్న వాళ్లందరూ ఆమెకు ఏమైందోనని భయాందోళనకు గురయ్యారు. కానీ, సదరు మహిళ మాత్రం స్విమ్మింగ్ పూల్ లో పడిన తర్వాత.. తాను బాగానే ఉన్నట్లు సిగ్నల్ ఇస్తూ.. రెండు చేతులూ పైకెత్తింది. అదృష్టవశాత్తూ ఆ మహిళకు గాయాలేవీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను ఒక ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియో కొన్ని గంటల్లోనే 11 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. 80,000 కంటే ఎక్కువ రీట్వీట్లను పొందింది.

చాలా మంది ట్విట్టర్ యూజర్లు మహిళ చేసిన స్టంట్‌ను ఖండించగా.. మరికొందరు మాత్రం మహిళ అలా పడిపోతే.. కనీసం ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదని.. చూసేవాళ్లని తిట్టిపోశారు. ఇంకొంతమందైతే కరోనా భయం లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటించలేదని ఆరోపించారు.

For More News..

సెల్ఫ్ ఐసోలేషన్ లోకి జార్ఖండ్ సీఎం