పోలీసు దెబ్బలకు ప్రాణాపాయ స్థితిలో యువకుడు

పోలీసు దెబ్బలకు ప్రాణాపాయ స్థితిలో యువకుడు

మెదక్ : మహిళ మెడలో నుంచి  బంగారg గొలుసు దొంగతనం చేశాడన్న అనుమానంతో  పోలీసులు ఓ యువకుడిని చితకబాదారు. విచారణ పేరుతో చావబాడటంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. తన భర్తను అకారణంగా కొట్టి ప్రాణాల మీదకు తెచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుని భార్య కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.

మెదక్ పట్టణంలోని అరబ్ గల్లిలో గత నెల 29న గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశాడు. సీసీ పుటేజీ  ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్‌‌లో పని చేసే  పిట్లం బేస్ వీధికి చెందిన మహమ్మద్ ఖదీర్​‌‌ను ఎంక్వైరీ పేరుతో తీసుకెళ్లారు. అతన్ని విపరీతంగా కొట్టిన పోలీసులు ఈ నెల 2న విడిచిపెట్టారు. పోలీసుల దెబ్బల కారణంగా తీవ్ర అస్వస్థతకులోనైన ఖదీర్ ను కుటుంబ సభ్యులు మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఈ నెల 6న ఖదీర్ భార్య సిద్దేశ్వరి కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. అకారణంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది.